Angelo Mathews: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విచిత్రంగా ఔట్ అయిన ఏంజెలొ మాథ్యూస్.. ఏంటీ టైమ్డ్ ఔట్?
Angelo Mathews: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ ఎవరూ ఔట్ కాని రీతిలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ రూపంలో ఔట్ అయ్యాడు. బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ చాకచక్యానికి మాథ్యూస్ బలికాక తప్పలేదు.
Angelo Mathews: బంగ్లాదేశ్ – శ్రీలంక మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 38వ లీగ్ మ్యాచ్‌లో లంక బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ విచిత్ర రీతిలో పెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ ఎవరూ ఔట్ కాని రీతిలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ రూపంలో ఔట్ అయ్యాడు. సమరవిక్రమ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. ఒక్క బంతి కూడా ఎదురుకాకుండానే ఔట్ అయి పెవిలియన్‌కు చేరడం గమనార్హం. బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ చాకచక్యానికి మాథ్యూస్ బలికాక తప్పలేదు.
టైమ్డ్ ఔట్ అంటే..?
క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ ఔట్ అయినా లేదా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్ రెండు నిమిషాలలో వచ్చి బంతిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో ఇన్కమింగ్ బ్యాటర్‌ను టైమ్డ్ ఔట్ కింద ఔట్‌గా ప్రకటిస్తారు. తాజాగా మాథ్యూస్ కూడా ఇదే రీతిలో నిష్క్రమించాడు.
మాథ్యూస్ ఔట్ వివాదం..
శ్రీలంక ఇన్నింగ్స్‌లో భాగంగా షకిబ్ అల్ హసన్ వేసిన 25వ ఓవర్లో రెండో బంతికి సమరవిక్రమ (41).. మహ్మదుల్లా కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ హెల్మెట్ ను సరిచేసుకునే క్రమంలో అది బాగోలేదని గమనించి కొత్తది కావాలని డగౌట్ వైపునకు సైగ చేశాడు. సబ్ స్టిట్యూట్ రావడం, కొత్త హెల్మెట్ పెట్టుకునేలోపు అప్పటికే మూడు నిమిషాలు గడిచాయి. దీంతో బంగ్లా సారథి షకిబ్.. అంపైర్‌కు ‘టైమ్డ్ ఔట్’ అప్పీల్ చేశాడు. అంపైర్లిద్దరూ చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. అప్పటికే అంపైర్ల దగ్గరకి వెళ్లిన మాథ్యూస్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. షకిబ్ ను కూడా జరిగిన విషయం చెప్పే యత్నం చేశాడు. కానీ షకిబ్ మాత్రం తనకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించి అక్కడ్నుంచి జారుకున్నాడు.
Angelo Mathews got timed out!!!!!..😯😯 pic.twitter.com/Jqfw9dXupK
— Shawstopper (@shawstopper_100) November 6, 2023
షకిబ్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో మాథ్యూస్ నిష్క్రమించక తప్పలేదు. అయితే బంతిని ఫేస్ చేయకున్నా మాథ్యూస్ రెండు నిమిషాలలోపే క్రీజులోకి వచ్చాడు. షకిబ్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లా సారథి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని దుమ్మెత్తిపోస్తుండగా బంగ్లా అభిమానులు మాత్రం తమ సారథి నిబంధనల మేరకే స్పందించాడని సమర్థించుకుంటున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

