కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను ‘సూచికలు’ అని అంటారు.
పసుపు పూసిన కాగితం ఒక ‘సమాజ సూచిక’ మందారపువ్వులు, మామిడి ఆకులు, బీట్రూట్ గన్నేరు పూల రసాల నుంచి కూడా సహజ సూచికలను తయారు చేయవచ్చు.
లిట్మస్, లైకేన్ అనే థాలోఫైటా వర్గానికి చెందిన మొక్కల నుంచి సేకరించిన రంజనం తటస్థ ద్రావణంలో లిట్మస్ రంగు ముదురు ఊదారంగు.
హైడ్రాంజియా, పిటూనియా, జిరేనియం వంటి మొక్కల రంగు పూల ఆకర్షక పత్రాలను కూడా సూచికలుగా ఉపయోగిస్తారు.
ఎసిటిక్ ఆమ్లం- వెనిగర్
ఓలిక్ ఆమ్లం- ఆలివ్ ఆయిల్
సిట్రిక్ ఆమ్లం- నిమ్మ, నారింజ
స్టీరిక్ ఆమ్లం- కొవ్వు పదార్థాలు
బ్యుటిరిక్ ఆమ్లం- వెన్న
టార్టారిక్ ఆమ్లం- ద్రాక్ష, చింతపండు
లాక్టిక్ ఆమ్లం- మజ్జిగ, పెరుగు
పామాటిక్ ఆమ్లం- పామాయిల్
ఆగ్జాలిక్ ఆమ్లం- పాలకూర, టమాట
ఎస్కార్టిక్ ఆమ్లం- ఉసిరి
మాలిక్ ఆమ్లం- ఆపిల్
యూరిక్ ఆమ్లం- మూత్రం
సబ్బు- సోడియం/పొటాషియం హైడ్రాక్సైడ్
1. ఆమ్ల ద్రావణాల్లో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు?
1) పసుపు 2) ఆకుపచ్చ
3) ఆరెంజ్ 4) ఎరుపు
2. క్షార ద్రావణాల్లో ఫినాఫ్తలిన్ సూచిక రంగు?
1) పసుపు 2) ఆకుపచ్చ
3) గులాబి 4) ఆరెంజ్
3. క్షార స్థితిలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు?
1) ఆరెంజ్ 2) ఆకుపచ్చ
3) ఎరుపు 4) నీలి రంగు
4. ఒక ద్రావణం ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోకి మార్చింది. దాని PH విలువ?
1) 1 2) 4 2) 5 4) 10
5. ఒక ద్రావణం పగిలిన కోడిగుడ్డు పొట్టుతో చర్చ జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపుతేటను పాల వలే మార్చింది. ఆ ద్రావణం దేనిని కలిగి ఉంటుంది?
1) Nacl 2) Hcl 3) Licl 4) Kcl
6. నీటిలో కరిగే క్షారాలను ఎలా పిలుస్తారు?
1) తటస్థ 2) క్షార
3) ఆమ్ల 4) క్షారయుత
7. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సార్వత్రిక PH సూచికలో ఏర్పడే రంగు (PH=1)?
1) ఆరెంజ్ 2) ఊదా
3) పసుపు 4) ఎరుపు
8. కింది వాటిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు?
1) యాంటీబయాటిక్ 2)ఎనాలిజ్టిల్
3) ఏంటాసిడ్ 4) యాంటీసెప్టిక్
9. మెగ్నీషియం లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వల్ల ఏర్పడే వాయువు?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) CO2 4) క్లోరిన్
10. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లం?
1) Hcl 2) H2SO4
3) CH3COOH 4) Hno3
11. చాలా లవణాలు వాతావరణం నుంచి నీటిని శోషిస్తాయి.
ఈ పద్ధతిని ఏమంటారు?
1) స్ఫటికీకరణం 2) డీ హైడ్రేషన్
3) బాష్పీభవనం 4) ద్రవీకరణం
12. కింది వాటిలో విరంజనకారిగా ఉపయోగించేది?
1) CaOcl2 2) Na2S2O3
3) Na2SO4 4) CuSO4
13. H2O + – -> H3O+
1) H+ 2) OH-
3) H2O 4) H3O+
బీఎస్ఎఫ్, ఈఎస్ఐ బుక్స్
బీఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఈఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి బుక్స్‌ను విజేత కాంపిటీషన్స్ విడుదల చేసింది.
రెండు పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా నిపుణులతో ఈ పుస్తకాలను రూపొందించారు. తక్కువ సమయంలో పరీక్ష పై అవగాహన వచ్చే విధంగా ఈ బుక్స్ ఉన్నాయి. వీటితోపాటు భారత ఆర్థిక సర్వే, విదుర నీతి, కణిక నీతి పుస్తకాలను కూడా విజేత కాంపిటీషన్స్ విడుదల చేసింది. పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. బీఎస్ఎఫ్ బుక్ పేజీలు: 528, ధర రూ.399, ఆర్థిక సర్వే రూ.199.
పుస్తకాలు, పూర్తి వివరాల కోసం బండ్ల పబ్లికేషన్స్, బతుకమ్మకుంట, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్. 040-27429494, 9963293399లో సంప్రదించవచ్చు.
-పీ ఢిల్లీ బాబు ఏకేఆర్ స్టడీ సర్కిల్,వికారాబాద్