గతవారం తరువాయి..
34. కింది వాటిలో సరికాని వాక్యం?
1) గుప్తులు వైశ్య వర్ణానికి చెందినవారు
2) గుప్త పాలనను స్థాపించినవారు శ్రీగుప్తుడు
3) ఇత్సింగ్ ప్రకారం శ్రీగుప్తుడు బౌద్ధ సన్యాసుల కోసం మఠాన్ని మృగశిర నగరం వద్ద ఏర్పాటు చేశాడు
4) మొదటి చంద్రగుప్తుడు శ్రీగుప్తుడి కుమారుడు
35. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) మొదటి చంద్రగుప్తుడు గుప్త శకాన్ని క్రీ.శ. 319-320లో ప్రారంభించాడు
2) మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి రాకుమార్తె కుమారదేవిని వివాహం చేసుకున్నాడు
3) సముద్ర గుప్తుడి పాలనా కాలం
క్రీ.శ. 330-380
4) మొదటి చంద్రగుప్తుడు ఘటోత్కచుడి కుమారుడు
36. కింది వాటిలో సరికానిది?
1) వీఏ స్మిత్ సముద్రగుప్తుడిని భారతదేశ నెపోలియన్‌గా అభివర్ణించాడు
2) గుప్త రాజుల్లో అతి గొప్పవాడు
సముద్రగుప్తుడు
3) సముద్రగుప్తుడు వీణ వాయించడంలో విశిష్ట ప్రావీణ్యం సంపాదించాడు
4) సముద్ర గుప్తుడి తర్వాత పాలకుడు
రుద్రసింహ-3
37. కింది వాటిలో సరికాని వాక్యాన్నిగుర్తించండి?
1) రామ గుప్తుడి బిరుదులు
వ్యాఘ్రహ పరాక్రమ, కుండలహీన
2) రెండో చంద్రగుప్తుడి బిరుదులు
సింహ విక్రమ, రాజాధిరాజ
3) రెండో చంద్రగుప్తుడి పాలనా కాలం
క్రీ.శ. 380-415
4) రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్య అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు
38. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) రామగుప్తుడిని ఓడించి అతడి భార్య ధృవాదేవిని బంధించిన ఉజ్జయిని శకరాజు మూడో రుద్రసింహుడు
2) రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో
నవరత్నాలు ఉండేవారు
3) రఘువంశం, మేఘదూతం,
రుతు సంహారం కాళిదాసు రచించిన ప్రముఖ నాటకాలు
4) మొదటి సంస్కృత నిఘంటువు ‘అమరకోశం’ను అమరసింహుడు రచించాడు
39. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) నవరత్నాల్లో ఒకడైన వరరుచి
ప్రాకృతంలో రచించిన ప్రాకృత వ్యాకరణ గ్రంథం ‘ప్రాకృత ప్రకాశం’
2) ‘నీతిశాస్త్రం’ను రచించింది కామాందకుడు
3) ‘మృచ్ఛకటికం’ను రచించింది శూద్రకుడు
4) ‘హస్తాయుర్వేదం’ను జంతుశాస్త్రంపై రచించింది వరాహమిహిరుడు
40. కింది వాటిలో సరికాని వాక్యాన్నిగుర్తించండి?
1) ఢిల్లీ దగ్గర మెహ్రౌలీ ఇనుపస్తంభ శాసనాన్ని వేయించింది రెండో చంద్రగుప్తుడు
2) రెండో చంద్రగుప్తుడి కుమార్తె పద్మావతి గుప్తను వివాహం చేసుకున్న వాకాటక రాజు నరసింహ బాలాదిత్య
3) ఎలిఫెంట, కన్హేరి గుహలను తొలిపించింది వాకాటకులు
4) రెండో చంద్రగుప్తుడి ప్రధాన సేనాని హరిసేనుడు
41. కింది వాటిలో సరికాని వాక్యాన్నిగుర్తించండి?
1) కుమారగుప్తుడి కాలం నుంచి భారతదేశంపై హుణుల దండయాత్రలు
ప్రారంభమయ్యాయి
2) క్రీ.శ. 510లో ఎరాన్ శాసనాలను
వేయించింది కుమారగుప్తుడు
3) మొదటిసారిగా సతీసహగమనాన్ని గురించి ఎరాన్ శాసనంలో పేర్కొన్నారు
4) స్కందగుప్తుడి తర్వాతివారిని
మలి గుప్తులు అంటారు
42. కింది వాటిలో సరికాని వాక్యం?
1) మలి గుప్తుల్లో గొప్పవాడు నరసింహగుప్త బాలాదిత్య
2) గుప్తుల్లో చివరివాడు విష్ణుగుప్తుడు
3) గుప్త రాజ్యం క్రీ.శ. 570లో అంతమయ్యింది
4) గుప్త రాజుల జన్మస్థలం గౌడదేశం
43. కింది వాటిలో సరికాని వాక్యాన్నిగుర్తించండి?
1) సంబంధిత రాజు విజయగాథలు, చరిత్రను విపులంగా వివరించేవి ప్రశస్తి శాసనాలు
2) సముద్రగుప్తుని ప్రశస్తి శాసనం
అలహాబాద్ శాసనం
3) సముద్ర గుప్తుని కాలంలో వేసిన
తామ్ర శాసనం పహర్‌పూర్ తామ్ర శాసనం
4) సింహంతో యుద్ధం చేస్తున్నట్లు నాణాలు విడుదల చేసింది సముద్రగుప్తుడు
44. కింది వాటిలో సరికానిది?
1) అశ్వమేధ యాగం చిహ్నంతో నాణాలు చేయించింది సముద్రగుప్తుడు
2) నెమలి గుర్తు గల నాణాలను విడుదల చేసింది కుమారగుప్తుడు
3) మొదటి చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన వివరాలను తెలిపే గ్రంథం ‘కలియుగరాజ వృత్తాంతం’
4) గుప్త యుగం నాటి సాంఘిక వ్యవస్థకు ఉపకరించే ఆధారాలు కాళిదాసు రచనలు
45. కింది వాటిలో సరికాని వాక్యాన్నిగుర్తించండి?
1) గుప్తుల రాజధాని పాటలీపుత్రం
2) గుప్త వంశ క్రమావళిని వివరించే సోమదేవుని గ్రంథం కథాసరిత్సాగరం
3) గుప్తుల అర్థశాస్త్రంగా ప్రసిద్ధిగాంచింది మృచ్ఛకటికం
4) సముద్రగుప్తుడు 18 ఆటవిక రాజ్యాలు, 5 ఈశాన్య రాజ్యాలను ఓడించినట్లు పేర్కొన్న శాసనం అలహాబాద్ శాసనం
46. కింది వాటిలో సరికాని వాక్యం?
1) అలహాబాద్ శాసనం ప్రకారం సముద్రగుప్తుడు ఓడించిన దక్షిణ దేశ రాజులు 8 మంది
2) సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయిన వేంగీ పాలకుడు హస్తివర్మ
3) సముద్రగుప్తుడు తన విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగం చేసిన మొదటి గుప్త చక్రవర్తి
4) సముద్రగుప్తుడు భూమిపై నడిచే దైవమని ప్రశంసించిన శాసనం అలహాబాద్
47. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) సాహిత్య ఆధారాల ప్రకారం
సముద్రగుప్తుడి తర్వాత సింహాసనం అధిష్టించింది రామగుప్తుడు
2) పశ్చిమ భారత ప్రాధాన్యాన్ని గుర్తించి రాజధానిని ఉజ్జయినికి మార్చింది
చంద్రగుప్తుడు-2
3) సింహం గుర్తుతో పాటు రెండో చంద్రగుప్తుడి బంగారు నాణాలపై గల పేరు విక్రమాదిత్య
4) కుమారగుప్తుడి బిరుదు మహేంద్రాదిత్య
48. కింది వాటిలో సరికానిది?
1) మొదటి కుమారగుప్తుడు కుమారస్వామి భక్తుడు
2) స్కందగుప్తుడు విష్ణు భక్తుడు
3) కుమారగుప్తుడు విడుదల చేసిన నాణాలపై గల దైవం కార్తికేయుడు
4) గుప్తుల పరిపాలన వ్యవస్థలో ప్రత్యేకత కేంద్రీకృత పాలన
49. కింది వాటిలో సరికాని వాక్యం?
1) గుప్త యుగంలో యుద్ధ మంత్రి
సంధి విగ్రాహక
2) గుప్త పాలనలో సైన్యాధిపతి
మహాదండ నాయకుడు
3) గుప్త యుగంలో అశ్వ దళానికి అధినాయకుడిగా వ్యవహరించే ఉన్నతోద్యోగి ఉక్కకల్ప
4) భుక్తిపై పరిపాలనాధికారి ఉపరిక
50. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) విషయాలపై పరిపాలనా అధికారి
విషయపతి
2) కొన్ని గ్రామాల సముదాయాన్ని
విత్తి అంటారు
3) గుప్తుల కాలంలో నగర పరిపాలన
నిర్వహించేది నగర సభలు
4) నగర సభలో సభ్యుల సంఖ్య 6
51. కింది వాటిలో సరికానిది?
1) రాజ్యం-విషయ-భుక్తి-విత్తి-గ్రామం
2) రాజ్యం-భుక్తి-విషయ-విత్తి-గ్రామం
3) రాజ్యం-భుక్తి-విత్తి-విషయ-గ్రామం
4) రాజ్యం-విషయ-విత్తి-భుక్తి-గ్రామం
52. కింది వాటిలో సరికాని వాక్యం?
1) నగర శ్రేష్టి- వర్తక సంఘం అధ్యక్షుడు
2) సార్థవాహ- వర్తక సంఘాల రక్షణ నాయకుడు
3) ప్రథమ కులిక- కుమారామాత్య
4) ప్రథమ కాయస్థ- ముఖ్య లేఖకుడు
53. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) గ్రామం అనేది పరిపాలనాపరంగా ప్రాథమికమైన విభాగం
2) గుప్తుల రాజ చిహ్నం గరుడ
3) అడవుల పరిరక్షణ కోసం నియమించిన అధికారి గౌలికుడు
4) గుప్తుల కాలంలో రాజుల వద్ద ఉన్న ప్రధాన భూస్వామిని ఉపరికుడు అనేవారు
54. కింది వాటిలో సరికానిది?
1) బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన భూమికి గల పేరు బ్రహ్మధేయాలు
2) భూదానాల వల్ల ఆవిర్భవించిన నూతన పరిణామం భూస్వామ్య వ్యవస్థ
3) గుప్తుల రెండో ప్రధాన ఆదాయ వనరు వాణిజ్యం
4) నవనీతకం అనే గ్రంథం వాణిజ్యానికి సంబంధించింది
55. కింది వాటిలో సరికాని వాక్యం?
1) రోమశ సిద్ధాంతం ప్రవేశపెట్టింది
వరాహమిహిరుడు
2) ప్రస్తుత చాంద్రమాన క్యాలెండర్‌కు
ఆధారమైనది రోమశ సిద్ధాంతం
3) గుప్త యుగంలో వర్థిల్లిన గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త శుస్రుతుడు
4) న్యూటన్ కంటే ముందు భూమికి
గురుత్వాకర్షణ శక్తి ఉందని నిరూపించింది బ్రహ్మగుప్తుడు
56. రెండో చంద్రగుప్తుడి సోదరుడు రామగుప్తుడిని శకులు ఓడించినట్లు, రామగుప్తుడిని వధించి రెండో చంద్రగుప్తుడు ధృవాదేవిని వివాహం చేసుకున్నట్లు తెలిపే గ్రంథం?
1) మృచ్ఛకటికం 2) కథాసరిత్సాగరం
3) నీతిసారం 4) దేవీచంద్రగుప్తం
57. కింది వాటిలో సరికానిది?
1) గుప్త యుగంలో హిందువుల పవిత్ర గ్రంథంగా ప్రాధాన్యం పొందింది భగవద్గీత
2) పశ్చిమ తీరంలో గుప్తుల ప్రధాన రేవు పట్టణం భరుగజం (బ్రోచ్)
3) గుప్తుల కాలంలో తూర్పు తీరంలో ప్రముఖ రేవు పట్టణం బాబారికయ్…. (సింధ్)
4) గుప్తుల నాణాల ముద్రణ కుషాణుల నాణాల ముద్రణను పోలి ఉంటుంది
58. కింది వాటిలో సరికాని వాక్యం?
1) దేవీచంద్రగుప్తం, ముద్రారాక్షసం
– విశాఖదత్తుడు
2) కౌముదీ మహోత్సవం- కలియుగ రాజు
3) బాసుడు రచించిన నాటకం
– స్వప్నవాసవదత్తం
4) మొట్టమొదటి లఘు కథానికల సంకలనం అయిన పంచతంత్ర గ్రంథాన్ని రచించింది విష్ణుశర్మ
59. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) గుప్తయుగానికి చెందిన విష్ణుదేవాలయం గల ప్రదేశం తీగవా (మధ్యప్రదేశ్)
2) గుప్త యుగానికి చెందిన శివాలయం గల ప్రదేశం భూమరా (మధ్యప్రదేశ్)
3) గుప్త యుగానికి చెందిన దశావతార దేవాలయం గల ప్రదేశం దేవ్‌ఘర్ (మధ్యప్రదేశ్)
4) గుప్త యుగానికి చెందిన ఇటుకలతో నిర్మించిన దేవాలయం గల ప్రదేశం
బాగ్ (మధ్యప్రదేశ్)
60. కింది వాటిలో సరికానిది?
1) గుప్తుల కాలంలో భూమిశిస్తు ఉత్పత్తిలో 1/4-1/6 వంతు ఉండేది
2) గుప్తుల కాలంలో బంగారంపై వేసే పన్ను హిరణ్య
3) గుప్తుల కాలంలో నీటిపై వేసే పన్ను శులక
4) గుప్తుల కాలంలో అత్యున్నత దైవం విష్ణువు
61. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) అజంతా గుహలు గుప్తుల కాలానికి చెందినవి
2) అజంతాలో 30 గుహాలయాలు ఉన్నాయి
3) 1828లో జాన్ స్మిత్ అజంతా గుహలను కనుగొన్నాడు
4) అజంతా గుహలు మహారాష్ట్రలోని
ఔరంగాబాద్ సమీపంలో ఉన్నాయి
62. కింది వాటిలో సరికానిది?
1) మెహ్రౌలీ ఇనుపస్తంభం ఎత్తు- 7.32 మీటర్లు
2) మెహ్రౌలీ ఇనుపస్తంభం 23 అడుగులు, 6 టన్నుల బరువు ఉంది
3) దుకులా అనే వస్ర్తాలు నూలుతో తయారుచేసేవారు
4) మితాక్షరం అనేది న్యాయశాస్త్ర గ్రంథం
63. కింది వాటిలో సరికాని వాక్యం?
1) ఎత్తిపోతల వ్యవసాయ విధానంలో ఉపయోగించే ఘటియంత్రం గురించి ప్రస్తావించినవాడు ఇత్సింగ్
2) ఇండియన్ న్యూటన్‌గా బ్రహ్మగుప్తుడిని పేర్కొంటారు
3) తక్షశిల విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసిన హుణ తెగ నాయకుడు తోరమానుడు
4) ఉజ్జయిని పట్టణంలో నవరత్నాలు ఉండేవారు
64. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) గుప్తుల కాలంలో లోహాలను వెలికితీసి కరిగించి పోతపోసిన కళ లోహకార కళ
2) లోహకార కళలో ఉపయోగించిన లోహాలు వెండి, బంగారం, రాగి, ఉక్కు, కంచు
3) బృహత్తర విగ్రహాలకు ఉపయోగించిన లోహం ఉక్కు
4) గుప్తులు విగ్రహాలను పోతపోయడానికి ఉపయోగించిన పద్ధతి నైర్
65. కింది వాటిలో సరికానిది?
1) రాజషాహి- రాముడు, అతడి అనుచరుల ప్రతిమలు
2) సారనాథ్- పద్మాసీనుడై ధర్మచక్ర ప్రవర్తన చేస్తున్న బుద్ధ విగ్రహం
3) మధుర- గుండు కలిగి నిల్చొని ఉన్న బుద్ధ విగ్రహం
4) పావయా- స్త్రీ వాయిద్యకారులతో పరివేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ
66. కింది వాటిలో సరికాని వాక్యాన్నిగుర్తించండి?
1) కౌముది మహోత్సవం
– చంద్రగుప్త పట్టాభిషేక మహోత్సవం
2) నీతిసారం- గుప్తుల వంశావళి
3) మృచ్ఛకటికం- చారుదత్త అనే
బ్రాహ్మణుడు వసంతసేన అనే వేశ్యను వివాహం చేసుకున్నాడు
4) కథాసరిత్సాగరం- భారతీయ సంస్కృతి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించడం
ఏఎన్ రావు విషయ నిపుణులు హైదరాబాద్