ఎవర్గ్రీన్ కెరీర్లలో స్టాటిస్టిక్స్ ఒకటి. ప్రపంచంలో మానవాళి మనుగడ ఉన్నంత వరకు ఈ రంగానికి ఢోకాలేదు. జనాభా లెక్కల నుంచి మొదలుపెడితే అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో స్టాటిస్టిక్స్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దేశంలో అత్యున్నతమైన సంస్థగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్‌కతా పేరుగాంచింది. ఆ సంస్థ ఇతర క్యాంపస్‌లలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు, కోర్సు చేసిన తర్వాత ఉపాధి అవకాశాల గురించి నిపుణ పాఠకుల కోసం…
ఐఎస్ఐ
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థను 1931లో ప్రముఖ ఆర్థికవేత్త పీసీ మహలనోబిస్ ప్రారంభించారు. మొదట చిన్న స్టాటిస్టికల్ ల్యాబొరేటరీగా ప్రారంభమై నేడు పలు క్యాంపస్‌లతో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా మారింది. ఈ సంస్థ స్టాటిస్టిక్స్, అనుబంధ సైన్సెస్‌పై శిక్షణ, పరిశోధన, యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది. 1959లో ఐఎస్ఐను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పార్లమెంట్ ఆమోదించింది. 1995 నుంచి స్టాటిస్టిక్స్‌తో సంబంధం ఉన్న మ్యాథ్స్, క్వాంటిటేటీవ్ ఎకనామిక్స్, కంప్యూటర్‌సైన్స్ డిగ్రీ, డిప్లొమాలను ఐఎస్ఐ ప్రారంభించింది.
క్యాంపస్‌లు
ఐఎస్ఐ కోల్‌కతా ప్రధానకార్యాలయంగా పనిచేస్తుంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. గిరిదిహ్, కోయంబత్తూర్, హైదరాబాద్, ముంబై, పుణె, వడోదరలలో బ్రాంచీలను ఏర్పాటుచేశారు.
ఐఎస్ఐ విజయాలు
1954లో రెండో పంచవర్ష ప్రణాళికను మహలనోబిస్ ఆధ్వర్యంలో ఐఎస్ఐలో రూపొందించారు. 1956లో దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ను ఇక్కడ తయారుచేశారు. ఆ తర్వాత దేశంలోనే మొదటి మెకానికల్ హ్యాండ్ కంప్యూటింగ్ మెషిన్, అనలాగ్ కంప్యూటర్, పంచ్డ్ కార్డ్ స్టోరింగ్ మెషిన్, సాలిడ్ స్టేట్ కంప్యూటర్లను ఈ సంస్థలోనే తయారుచేయడం విశేషం.
ప్రోగ్రామ్స్ బీస్టాట్ (ఆనర్స్)
కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. వ్యవధి మూడేండ్ల్లు. 50 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు.
స్టయిఫండ్: ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5000/- ఇస్తారు.
బీమ్యాథ్స్ (ఆనర్స్)
బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్ విధానంలో నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేండ్లు. 50 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు.
స్టయిఫండ్: ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5000/- ఇస్తారు.
ఎం.స్టాట్ (మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్)
ఢిల్లీ క్యాంపస్ ఆఫర్ చేస్తుంది.
అర్హతలు: ఏదైనా మూడేండ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్ కోర్సు చదివి ఉండాలి.
స్టయిఫండ్: నెలకు రూ.8000/- ఇస్తారు.
ఎం.మ్యాథ్స్ (మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్)
ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు.
అర్హతలు: మూడేండ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు.
స్టయిఫండ్: నెలకు రూ.8 వేలు ఇస్తారు.
ఎంఎస్ (క్వాంటిటేటివ్ ఎకనామిక్స్)
కోల్‌కతా, ఢిల్లీ క్యాంపస్‌లలో అందిస్తున్నారు. రెండేండ్ల కాలవ్యవధి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
స్టయిఫండ్: నెలకు రూ.8000/- ఇస్తారు.
ఎంఎస్ (క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్సెస్)
ఈ కోర్సు బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్‌లలో నిర్వహిస్తున్నారు.
అర్హతలు: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ పూర్తిచేసి ఉండాలి.
స్టయిఫండ్: నెలకు రూ.8 వేలు ఇస్తారు.
ఎంఎస్ (లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్)
బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్నారు. రెండేండ్ల కాలవ్యవధి.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు.
నెలకు రూ.8 వేలు
ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్)
కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. రెండేండ్ల కాలవ్యవధి.
అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చేసినవారు అర్హులు.
ఎంటెక్ (క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ-సీఆర్ఎస్)
కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చేసినవారు అర్హులు.
ఎంటెక్ (క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రిసెర్చ్-క్యూఆర్‌ఓఆర్): కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందుబాటులో ఉంది. 25 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేదా మ్యాథ్స్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బీఈ/ బీటెక్ ఉండాలి.
వీటితోపాటు కింది కోర్సులను ఐఎస్ఐ ఆఫర్ చేస్తుంది.
స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ ఎనలిటిక్స్: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వ్యవధి ఏడాది.
చెన్నై, తేజ్‌పూర్ క్యాంపస్‌లు అందిస్తున్నాయి.
ఒక్కో క్యాంపస్‌లో 15 చొప్పున సీట్లు ఉన్నాయి.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ విత్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్ (పీజీడీఏఆర్‌ఎస్‌ఎంఏ): ఈ విద్యా సంవత్సరం నుంచి గిరిదిహ్ క్యాంపస్‌లో ఏడాది కోర్సును అందిస్తున్నారు. ఇందులో 15 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్లో మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఈ కోర్సుకు స్టయిఫండ్ లేదు.
జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్: స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్, ఫిజిక్స్ అండ్ అప్లయిడ్ మ్యాథ్స్, బయలాజికల్ సైన్స్, డెవలప్మెంట్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టుల్లో అవకాశం లభిస్తుంది.
అందిస్తున్న క్యాంపస్‌లు: కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గిరిధ్ క్యాంపస్‌లో ఈ కోర్సులు ఉన్నాయి.
పై క్యాంపస్‌లలో డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.5 వేలు, పీజీ కోర్సులు చేసేవారికి రూ.8 వేలు, ఎంటెక్ కోర్సులకు రూ.12,400/- స్టయిఫండ్ చెల్లిస్తారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో జేఆర్ఎఫ్కు ఎంపికయితే నెలకు రూ.31,000+ హెచ్ఆర్ఏ, సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లకు రూ.35,000+ హెచ్ఆర్ఏ అందిస్తారు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ఏటా కంటింజెన్సీ గ్రాంట్ ఇస్తారు. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు ఉన్నాయి. కోర్సు చివరలో క్యాంపస్ నియామకాలు చేపడతారు. ఇక్కడ పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు లభిస్తున్నాయి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వస్తున్న సంస్థలు
ఈ సంస్థలో కోర్సులు చేసినవారికి దాదాపు 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.
ఏఐజీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్జెడ్, యాక్సిస్ బ్యాంక్, ఏబీ ఇన్ వెబ్, ఏఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్, బార్క్ ఇండియా, బీసీఎస్ టెక్నాలజీ, బ్లాక్‌రాక్, క్యాపిటల్ వన్, సిటీ బ్యాంక్, క్రిసిల్, సిబిల్, సిటీ కార్పొరేషన్, డెలాయిట్, డా.రెడ్డీస్ ల్యాబ్, దునియా ఫైనాన్స్, ఎఫ్ఐసీవో, గోల్డ్స్మన్సాచ్, మెట్రో, హెచ్ఎస్బీసీ, ఐబీఎం, ఐసీఐసీఐ, జేపీ మోర్గాన్, మహీంద్రా, మైక్రోసాఫ్ట్, నోవార్టిస్, టీసీఎస్, స్టాండర్డ్ చార్టెర్డ్, వాల్‌మార్ట్, సామ్సంగ్, నీల్సన్, రెడ్‌బస్, రిలయన్స్ తదితర ఎంఎన్‌సీలు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 31
దరఖాస్తు ఫీజు: జనరల్ పురుషులకు రూ.1250/-
జనరల్ మహిళలకు రూ.750/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులకు రూ.625/-
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 20
పరీక్షతేదీ: మే 8
రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్సైట్: https://www.isical.ac.in