Gynecology | మా అమ్మాయికి.. ప్రతి నెలా ఇబ్బందే!

మా అమ్మాయి వయసు 16 ఏండ్లు. పదమూడేండ్లకే రజస్వల అయ్యింది. మొదటి రెండేండ్లు సరైన సమయానికే నెలసరి వచ్చేది. కానీ గత ఏడాది నుంచీ రెండుమూడు నెలలకోసారి వస్తున్నది. మంచి పోషకాహారమే ఇస్తుంటాను. అయినా ఏ కారణం వల్ల ఇలా జరుగుతున్నదో అర్థం కావడంలేదు.
-ఓ సోదరి
జ: నెలసరి సరిగ్గా రాకపోవడానికి అనేక కారణాలు. మన మెదడులో హైపోథాలమస్, పిట్యూటరీ అనే రెండు గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి విడుదలయ్యే హార్మోన్లలో తేడాలు వచ్చినప్పుడు అవి సిగ్నల్స్ రూపంలో అండాశయాలకు వెళ్తాయి. అక్కడ ఏదైనా సమస్య ఉంటే, అది గర్భసంచికి కూడా ఇబ్బందికరంగానే మారుతుంది. ఇలా ఎక్కడ సమస్య వచ్చినా నెలసరి సరిగ్గా రాకపోవచ్చు. థైరాయిడ్ గ్రంథిలో సమస్య ఉన్నా నెలసరి సమయానికి రాదు. అలాగే ఈ తరం పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య.. పాలీ సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ). ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరిలో పీసీఓడీని చూస్తున్నాం. నెలసరి సరిగ్గా రాకపోవడం, వచ్చినా బ్లీడింగ్ ఎక్కువగా కాకపోవడం, అవాంఛిత రోమాలు, ముఖంపై మొటిమలు, పొట్ట భాగంలో కొవ్వు పేరుకోవడం, ఉన్నట్టుండి బరువు పెరగడం.. తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇవేకాకుండా రోజువారీ జీవితంలో ఒత్తిడికి లోనుకావడం, ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం, గర్భ నిరోధక మాత్రలు వాడటం, కాపర్ టీ (లూప్) లాంటివి ఉపయోగించడం, అండాశయం నుంచి అండాలు విడుదల కాకపోవడం, క్యాన్సర్ తొలి దశలో ఉండటం.. మొదలైన కారణాల వల్ల కూడా నెలసరి క్రమంగా రాకపోవచ్చు. కాబట్టి, నెలసరి సరిగ్గా రాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- gynecology
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

