బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్.. స్వాగతించిన జ్వలరీ షాపు ఓనర్లు

సూరత్: బంగారు ఆభరణాలతో పాటు ఇతర బంగారు వస్తువులపై కచ్చితంగా హాల్‌మార్క్ ఉండాలన్న నిబంధన దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సూరత్‌లో సూరత్‌లో ఉన్న జ్వలరీ షాపు ఓనర్లు, కస్టమర్లు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు. బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని ఓ కస్టమర్ తెలిపారు. హాల్‌మార్క్ ఉన్న బంగారం కొంటే.. మనల్ని ఎవరూ మోసం చేయలేరన్న నమ్మకం పెరిగిందన్నారు. హాల్‌మార్క్ బంగారం వంద శాతం శుద్ధీకరించి ఉంటుందని ఓ కస్టమర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరంగా ఉందని, అమ్మకందారుడు, కొనుగోలుదారుడి మధ్య నమ్మకం పెరుగుతుందని, దేశమంతా కస్టమర్‌కు హాల్‌మార్క్ బంగారమే లభిస్తుందని, వాళ్లు నూటికి నూరు శాతం ప్యూర్ గోల్డ్ దొరుకుతుందని కుశాల్భాయ్ జ్వలర్స్ షాపు ఓనర్ తెలిపారు. బంగారు ఆభరణాలు, ఇతర ఆర్ట్ వస్తువులపై హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండాలని 2019 నవంబర్‌లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2021, జనవరి 15వ తేదీ నుంచి హాల్‌మార్క్ కచ్చితంగా ఉండాలని సూచించింది. కానీ పాత స్టాక్‌కు హాల్‌మార్కింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆ గడువును జూన్‌కు పెంచారు. నేటి నుంచి ఆ నియమం అమలులోకి వచ్చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

