పతనం అంచున పంజాబ్ కాంగ్రెస్! ఎందుకంటే..?!
పతనం అంచున పంజాబ్ కాంగ్రెస్! ఎందుకంటే..?! | పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలను పరిష్కరించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రూపొందించిన రాజీ ....

న్యూఢిల్లీ: పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలను పరిష్కరించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రూపొందించిన రాజీ ఫార్ములా పరిస్థితిని మరింత సంక్లిష్ఠం చేసింది. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, మాజీ ఎంపీ నవ్‌జ్యోతి సిద్దూ మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై చర్చోప చర్చలు గావించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. సిద్దూను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
ఫామ్ హౌస్‌లో అమరిందర్ సమాలోచనలు
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం అమరిందర్ సింగ్‌కు శరాఘాతంలా తగిలింది. దీనిపై అమరిందర్ సింగ్ గురువారం మొహాలీలోని తన ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు.
ఆరుగురు రెబెల్ ఎమ్మెల్యేలతో సిద్దూ భేటీ
మరోవైపు అమరిందర్ సింగ్ వ్యతిరేక గ్రూప్‌లోని ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో నవ్ జ్యోతి సిద్దూతో విడిగా సమావేశయ్యారు. సిద్దూతో భేటీ అయిన మంత్రుల్లో సుఖీందర్ సింగ్ రాంధావా, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, త్రిప్ట్ రాజీందర్ బజ్వా ఉన్నారు.
రెబెల్ మంత్రులకు ఉద్వాసన?
తిరుగుబాటు మంత్రులను క్యాబినెట్ నుంచి సీఎం అమరిందర్ సింగ్ తొలగిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిసింది.
జక్కర్ స్థానంలో సిద్దూ పీసీసీగా నియామకం?
సునీల్ జక్కర్ స్థానంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ నియమించనున్నట్లు పేర్కొన్నా.. కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ఆ ప్రకటన వెల్లడించలేదు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఒక దళితుడు, మరో హిందువును నియమించారు.
గాంధీల త్రయం ఆధ్వర్యంలో రాజీ ఫార్ములా
ఇటీవల సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రాలతోపాటు సిద్ధూ, అమరిందర్ సింగ్ మధ్య దఫాదఫాలుగా చర్చోపచర్చలు జరిపి ఈ ప్రణాళికను రూపొందించారు.
2017 నుంచే సిద్దూ, అమరిందర్ మధ్య విభేదాలు
2017 ఎన్నికల నుంచి అమరిందర్ సింగ్, నవ్‌జ్యోతి సిద్దూ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దూ.. ఆ ఎన్నికల్లో గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతారని ఆశలు పెట్టుకున్నారు. కానీ, సిద్దూను అమరిందర్ సింగ్ పక్కనబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
భగ్గుమన్న బంగారం : ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు పైపైకి!
సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్బీఐ గవర్నర్
అదరగొట్టిన ఇన్ఫీ
మాస్టర్‌కార్డ్‌కు ఆర్బీఐ షాక్
పెట్రో షాక్ : వాహన విక్రయాలకు ఎదురుదెబ్బ
బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్‌గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
సోనూసూద్‌నే కొడుతావా.. టీవీ పగలగొట్టిన బుడ్డోడు
సొంతింటి కోసం హైదరాబాదీల పరుగులు.. గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

