కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇలా జరిగింది..!

ముంబై : కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత తమకు జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడ్డామని ప్రజలు చెబుతుంటే మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక తనకు మాగ్నెటిక్ శక్తులు వచ్చాయని చెబుతున్నాడు. నాసిక్ శివాజీనగర్ కు చెందిన అరవింద్ సోనార్ అనే పెద్దాయన కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత తనలో మాగ్నెటిక్ శక్తులు పుట్టుకొచ్చాయని వెల్లడించాడు. వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత లోహపు వస్తువులు తన శరీరంపై అతుక్కుంటున్నాయని చెప్పాడు.
తన వాదనకు మద్దతుగా సోనార్ ఓ వీడియో కూడా రూపొందించాడు. ఈ వీడియోలో ఆయన శరీరంపై ప్లేట్లు, స్పూన్లు, కాయిన్లు అతుక్కుపోయిన తీరు కనిపించింది. చెమట వల్ల ఇదంతా జరుగుతుందని కుటుంబ సభ్యులు అనుకున్నా స్నానం చేసిన తర్వాత ఇలాగే జరుగుతోంది. అయితే ఆయనను పరీక్షించిన వైద్యులు వ్యాక్సినేషన్ తర్వాతే ఇలా జరిగిందని తాము నిర్ధారించలేదని, ప్రభుత్వానికి తాము నివేదిక పంపుతామని, ఆపై అవసరమైతే పరీక్షలు నిర్వహిస్తామని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యులు డాక్టర్ అశోక్ థొరాట్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

