ఐఐటీ హాస్టల్లో తూటాల కలకలం
ఐఐటీ బాంబే హాస్టల్లో ఓ విద్యార్థి సంచిలో ఐదు తూటాలు లభ్యం కావటం తీవ్ర కలకలం రేపింది. హాస్టల్ ఆవరణలో భద్రత తనిఖీ సందర్భంగా ఓ విద్యార్థి నుంచి 7.65 ఎంఎం తూటాలు స్వాధీనం చేసుకున్నట్టు వర్సిటీ క్యాంపస్ అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు.
- బీహార్ వ్యక్తి తెచ్చినట్టు నిర్ధారణ
బాంబే, ఫిబ్రవరి 22: ఐఐటీ బాంబే హాస్టల్లో ఓ విద్యార్థి సంచిలో ఐదు తూటాలు లభ్యం కావటం తీవ్ర కలకలం రేపింది. హాస్టల్ ఆవరణలో భద్రత తనిఖీ సందర్భంగా ఓ విద్యార్థి నుంచి 7.65 ఎంఎం తూటాలు స్వాధీనం చేసుకున్నట్టు వర్సిటీ క్యాంపస్ అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య డబ్బు విషయంలో ఈ నెల 19న జరిగిన చిన్న గొడవ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.
తూటాలున్న బ్యాగ్ ఎక్కడిదని పోలీసులు గొడవ పడిన విద్యార్థుల్లో ఒకరైన సూరజ్ దూబేను ప్రశ్నించగా అది తన స్నేహితుడు అపూర్వ్‌కు చెందినదని అతడు తెలిపాడు. దీంతో అపూర్వ్ను దీనిపై విచారణ చేయగా బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన తన పరిచయస్థుడు సతీశ్ చంద్ర చౌదరి ఆ బుల్లెట్లను తెచ్చాడని అతడు తెలిపాడు. దీంతో పోలీసులు చౌదరిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా& తాను వాటిని బీహార్‌లోని ముంగేర్‌లో కొన్నట్టు చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

