Beauty Tips | చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..
Beauty Tips | మనిషిని వేధిస్తున్న ప్రధాన చర్మ సమస్యల్లో నల్ల మచ్చలు (బ్లాక్ హెడ్స్) ఒకటి. చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లని కురుపుల్లాంటి ఈ మచ్చలు.. తొలగించినా కొద్ది పదేపదే వస్తుంటాయి.
మనిషిని వేధిస్తున్న ప్రధాన చర్మ సమస్యల్లో నల్ల మచ్చలు (బ్లాక్ హెడ్స్) ఒకటి. చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లని కురుపుల్లాంటి ఈ మచ్చలు.. తొలగించినా కొద్ది పదేపదే వస్తుంటాయి. మృతకణాలు చర్మ రంధ్రాలను పూడ్చేయడంవల్ల ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. అదేవిధంగా చర్మంపై గల చిన్న రంధ్రాల్లో డెత్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడంవల్ల కూడా నల్లటి మచ్చలు వస్తాయి. ముక్కు, గదమ మీద ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం..
మచ్చలను మాయం చేసే టిప్స్..
1. వేడి నీటి ఆవిరి
వంటపాత్రలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ తర్వాత నీటి ద్వారా వచ్చే అవిరిపై టవల్‌ను పెట్టాలి. వెంటనే ఆ టవల్‌ను బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉన్న చోట సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా మూడుసార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. చిక్కటి పెరుగు, శనగపిండి, కాఫీ పొడి
పెరుగు, శనగపిండి, కాఫీపొడి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లై చేసి చేతులతో తేలికగా మసాజ్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలపాటు మసాజ్ చేసి, ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అనంతరం ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా మసాజ్ చేయడంవల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
3. కోడిగుడ్డు తెల్లసొన, బేకింగ్ సోడా
కోడిగుడ్డులోని తెల్లసొనలో రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా మిక్స్ చేసి ముఖానికి 15 నుంచి 20 నిమిషాలపాటు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చేతులతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవచ్చు. దీంతో నల్లమచ్చలు త్వరగా తగ్గిపోతాయి.
4. పుదీనా పేస్ట్
పుదీనా ఆకులను పేస్టు చేసుకుని ఉపయోగించడం ద్వారా సులభంగా బ్లాక్ హెడ్స్‌ను దూరం చేసుకోవచ్చు. అందు కోసం ముందుగా పుదీనా ఆకులు, చిటికెడు పసుపును నీటిలో వేసి మరిగించాలి. అలా మరిగించిన ఆకులను మెత్తగా చేసి ముఖానికి పట్టించి కాసేపు అలాగే వదిలేయాలి. అనంతరం చేతులతో సుతిమెత్తగా మసాజ్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని లేదా సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ఇవి కూడా చదవండి..
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Cucumber | ఎండాకాలంలో దొరికే కీరదోసను తొక్క తీసి తినడం మంచిదేనా?
Health Tips | మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారా.. అయితే ఈ పండు మీకు చక్కటి పరిష్కారం..!
Health Tips | నిమ్మకాయతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం.. ఎలాగో తెలుసా..?
Health tips | వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెటర్.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

