అయస్కాంతంతో ఆక్సిజన్ ఉత్పత్తి
లండన్, ఆగస్టు 15: రోదసిలో సుదీర్ఘ ప్రయాణాలు సాగించే వ్యోమగాముల కోసం అయస్కాంతాల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతను ఇంగ్లండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోడ్ ఉపరితలాల నుంచి వాయు బుడగలను ఉత్పత్తి చేసి, ఆక్సిజన్‌ను సృష్టించవచ్చని, తాము చేసిన ప్రయోగంలో ప్రాణవాయువు ఉత్పత్తి జరిగిందని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ పరిశోధకులు తెలిపారు.
ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టి ఇప్పటివరకూ వ్యోమగాములకు ప్రాణవాయువును సరఫరా చేస్తున్నారని, ఈ విధానంలో వెలువడే హైడ్రోజన్ వంటి వాయువులతో వ్యోమనౌకలోని వ్యవస్థలకు అంతరాయం కలుగొచ్చని పరిశోధకులు తెలిపారు. తాము అభివృద్ధి చేసిన తాజా సాంకేతికతతో అలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

