Nobel Prize | ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్ర నోబెల్
ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్( Nobel Prize ) ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. సంక్లిష్ట భౌతిక వ్యవస్థలపై మన అవగాహనకు సంబంధించి వీళ్లు చేసిన రచనలకుగాను ఫిజిక్స్ నోబెల్‌ను ప్రకటించారు.

స్టాక్‌హోమ్: ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్( Nobel Prize ) ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. సంక్లిష్ట భౌతిక వ్యవస్థలపై మన అవగాహనకు సంబంధించి వీళ్లు చేసిన రచనలకుగాను ఫిజిక్స్ నోబెల్‌ను ప్రకటించారు. స్యుకురో మనాబె, క్లాస్ హాసెల్మాన్, గియోర్గియో పారిసిలకు ఫిజిక్స్ నోబెల్ ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. నోబెల్ బహుమతితోపాటు ఇచ్చే ప్రైజ్‌మనీలో సగం పారిసికి, మిగతా సగం మానబె, హాసెల్‌మాన్‌లకు ఇవ్వనున్నట్లు అకాడమీ తెలిపింది.
ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ గెలిచిన పారిసి.. క్రమరహిత సంక్లిష్ట పదార్థాలలో దాగి ఉన్న నమూనాలను కనుగొన్నారు. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంత రచనలకు అతని ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయని రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. ఇక వాతావరణం, పర్యావరణాన్ని కలిపే మోడల్‌ను సృష్టించిన క్లాజ్ హాసెల్‌మాన్‌ను కూడా ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ వరించింది. మనుషుల కారణంగా ఉత్పన్నమవుతున్న కార్బన్‌డైఆక్సైడ్ వల్లే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని ఆయన పద్ధతులు నిరూపిస్తున్నాయి.
వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ స్థాయులు పెరిగిన కొద్దీ భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయో నిరూపించిన స్యుకురో మనాబెను కూడా ఈసారి ఫిజిక్స్ నోబెల్‌కు ఎంపిక చేశారు. ప్రస్తుత పర్యావరణ మోడల్స్‌ను రూపొందించడానికి ఆయన రచనలు ఓ ఫౌండేషన్లా పని చేసినట్లు స్వీడిష్ రాయల్ అకాడమీ తెలిపింది.
స్యుకురో మనాబె.. జపాన్‌లోని షింగు నగరంలో 1931లో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో నుంచి 1957లో ఆయన పీహెచ్డీ పొందారు. అమెరికాలోని ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో సీనియర్ మెటిరాలాజిస్ట్‌గా చేస్తున్నారు.
క్లాస్ హాసెల్మాన్.. జర్మనీలోని హాంబర్గ్‌లో 1931లో పుట్టారు. జర్మనీలోని గొట్టిన్‌జెన్ వర్సిటీ నుంచి 1957లో పీహెచ్డీ పూర్తి చేశారు. హాంబర్గ్‌లో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటిరాలజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు.
గియోర్గియో పారిసి.. ఇటలీ దేశంలోని రోమ్‌లో 1948లో జన్మించారు. రోమ్‌లో ఉన్న సెపింజా యూనివర్సిటీ నుంచి 1970లో ఆయన పీహెచ్డీ పూర్తి చేశారు. సెపింజా వర్సిటీలోనే ప్రొఫెసర్‌గా చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

