స్మార్ట్ పార్కింగ్
గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్‌లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ్చే వాకర్ల వాహనాలతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ సమస్య జఠిలంగా ఉంటున్నది.
- ‘కేబీఆర్’ వద్ద మల్టీలెవల్ కారు పార్కింగ్
- రూ.3 కోట్లతో టెండర్లు.. పీపీపీ విధానంలో నిర్మాణం
- కీలక కారిడార్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్‌లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ్చే వాకర్ల వాహనాలతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ సమస్య జఠిలంగా ఉంటున్నది. దీంతో పార్కింగ్ సమస్యకు చెక్ పెడుతూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్కు గేట్-1 వద్ద కడక్ చాయ్ సమీపంలో స్మార్ట్ మల్టీలెవల్ (మెకనైజ్డ్) కార్, మోటారు సైకిల్ పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు సిద్ధమయ్యారు.
ఈ మేరకు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో ఆసక్తి గల ఏజెన్సీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు టెండర్లు ఆహ్వానించారు. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడ్‌లో పైలెట్ ప్రాజెక్టుగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయనున్నారు. 405 చదరపు మీటర్లలో మల్టీలెవల్ కారు పార్కింగ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 72 కారు స్పేస్‌లకు పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మల్టీలెవల్ కారు, మోటారు సైకిల్ పార్కింగ్ సదుపాయంలో సీసీటీవీ, ఇతర అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15న టెండర్ తాలూకు టెక్నికల్ బిడ్లు తెరిచి ఏజెన్సీలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

