Crime | హుమాయూన్ నగర్లో బైక్ దొంగల అరెస్ట్… 13 బైక్‌లు స్వాధీనం

మెహిదీపట్నం :డూప్లికేట్ తాళం చెవులతో ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ఓ దొంగను ,అతడికి సహకరిస్తున్న ఓ బాలుడిని హుమాయూన్‌నగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో జాయింట్ కమీషనర్, డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్.జీ..శివమారుతి, హుమాయూన్‌నగర్ ఇన్స్పెక్టర్ సునీల్, అదనపు ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు.
బహుదూర్‌పురా ఇక్బాల్ కాలనీకి చెందిన జహరుల్ హసన్(32)జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బులు సులువుగా సంపాదించాలన్న ఆశతో డూప్లికేట్ తాళాలను ఉపయోగించి ద్విచక్రవాహనాలను దొంగిలించడం ప్రారంభించాడు. బుధవారం హుమాయూన్‌నగర్ పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. ఇతడికి సహకరిస్తున్న ఓ బాలుడిని కూడా గురువారం పట్టుకుని వారి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జహరుల్ హసన్‌ను జైలుకు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

