హృతిక్శౌర్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ ఉపశీర్షిక. ఫ్లిక్‌నైన్ సంస్థ నిర్మిస్తున్నది. రవి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు. ‘మన దేశంలో కులం మతం తేడా లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగ’ అనే డైలాగ్‌తో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.
ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ ‘ఓటుకు డబ్బులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి ఉన్న సమాజాన్ని వెన్నుతట్టి లేపాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి సినిమాలు రావాలి’ అన్నారు. నేటి వ్యవస్థలోని లోటుపాట్లను చర్చిస్తూ చక్కటి సందేశాన్ని అందించే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యస్.రాజశేఖర్, సంగీతం: ఆగస్త్య, రచన-దర్శకత్వం: రవి.