Sara Ali Khan | సారా అలీ ఖాన్‌కు కేదార్నాథ్ షాక్?.. సనాతన ధర్మంపై నమ్మకం ఉంటేనే ఎంట్రీ!
Sara Ali Khan | ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై 'బద్రీ-కేదార్ ఆలయ కమిటీ' (BKTC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Kedarnath | ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై ‘బద్రీ-కేదార్ ఆలయ కమిటీ’ (BKTC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు కమిటీ పరిధిలోని 47 ఆలయాల్లోకి ఇకపై సనాతన ధర్మంపై నమ్మకం లేని వారికి ప్రవేశం ఉండదని కమిటీ స్పష్టం చేసింది. అన్యమతస్థులు ఎవరైనా ఈ క్షేత్రాలను దర్శించుకోవాలంటే, తమకు సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ ఒక అఫిడవిట్ (Affidavit of Faith) సమర్పించాల్సి ఉంటుందని కమిటీ ప్రకటించినట్లు సమాచారం. అయితే ఈ కొత్త రూల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌కి సమస్య తెచ్చేలా కనిపిస్తుంది.
సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. కేదార్‌నాథ్‌పై ఉన్న ఇష్టంతోనే కేదార్నాథ్ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా) అనే సినిమాలో కూడా నటించింది సారా. అయితే BKTCపెట్టిన తాజా నిబంధనలు ఆమెపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇక నటి సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌ను దర్శించుకుంటున్న నేపథ్యంలో, ఆమె ప్రవేశం గురించి మీడియా ప్రశ్నించగా BKTC చైర్మన్ హేమంత్ ద్వివేది స్పందిస్తూ.. సారా అలీ ఖాన్‌కు సనాతన ధర్మంపై నమ్మకం ఉండి, ఆమె అఫిడవిట్ సమర్పిస్తే ఖచ్చితంగా దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఈ క్షేత్రాల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు ఆది శంకరాచార్యుల కాలం నాటి సంప్రదాయాలను అధికారికంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ పేర్కొంది. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా భక్తుల వివరాల సేకరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది.
అయితే ఆలయా కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దేశంలో నిరుద్యోగం వేధిస్తోంది.. గ్యాస్ సిలిండర్ల ధరలు మండిపోతున్నాయి.. కనీసం పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యల జాబితా అనంతంగా సాగుతోంది. కానీ ఇవేవి పట్టనట్లు ప్రజల ప్రాథమిక అవసరాలను పక్కనబెట్టి, అన్యమతస్థులు దేవుడిని దర్శించుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని కొత్త నిబంధనలు తీసుకురావడం నవ్వు తెప్పించేలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దేశంలో అసలైన సమస్యలను గాలికొదిలేసి, ఇలాంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్న తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో ఇంకెలాంటి వింతలు చూడాల్సి వస్తుందో అంటూనెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

