KGF-2 Movie | వంద రోజులు పూర్తి చేసుకున్న ‘కేజీఎఫ్-2’.. వైరల్ అవుతున్న స్పెషల్ వీడియో
KGF-2 Movie | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.1250 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రశాంత్ నీల్ టేకింగ్, యశ్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌లో కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
శుక్రవారంతో ఈ సినిమా వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రావురమేష్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు.
https://twitter.com/prashanth_neel/status/1550359505116221441?s=20&t=eBJpOaB5bEPwreDaQqXKww
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

