Cinema News | హీరోగా మారనున్న తమిళ స్టార్ డైరెక్టర్.. శృతిహాసన్‌తో రొమాన్స్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటిస్తున్నారు. శృతిహాసన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. అయితే, సినిమాలో కాకుండా ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.
Cinema News | తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటిస్తున్నారు. శృతిహాసన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. అయితే, సినిమాలో కాకుండా ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రేమ గొప్పదనాన్ని చాటిచెప్తూ సాగే ఈ మ్యూజిక్ వీడియోకు సంబంధించిన లిరిక్స్‌ను శృతిహాసన్ స్వయంగా రాయడమే కాక సంగీతం కూడా సమకూరుస్తున్నది.
కూతురు మ్యూజిక్ వీడియోకు నిర్మాతగా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్ తన ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ద్వారా విడుదల చేయనున్నారు. దీంట్లో లోకేశ్-శృతి కెమిస్ట్రీ హైలైట్‌గా ఉండబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ వీడియో తాలూకు పోస్టర్‌ను శృతిహాసన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదల కానున్నదీ వీడియో. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న లోకేశ్‌కు హీరోగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆయన డైరెక్షన్ చేస్తున్న ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. అయితే కేజీఎఫ్ స్టంట్ మాస్టర్ అన్బరివ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ఓ సినిమాతో లోకేశ్ కనగరాజ్ హీరోగా మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

