Harish Shankar | బాలీవుడ్ అగ్ర హీరోతో హరీష్ శంకర్ కథా చర్చలు.. టాలీవుడ్ హీరోలపై ఆశలు వదులుకున్నట్లేనా?
Harish Shankar Next Movie | ఫ్యామిలీ డ్రామాకు కమర్షియల్ హంగులను జోడించి బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తుంటాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈయన నుండి సినిమా వస్తుందంటే మినిమం ఎంటర్టైనింగ్ గ్యారెంటీ అని ప్రేక్షకులను భావిస్తుంటారు.
Harish Shankar Next Movie | ఫ్యామిలీ డ్రామాకు కమర్షియల్ హంగులను జోడించి బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తుంటాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈయన నుండి సినిమా వస్తుందంటే మినిమం ఎంటర్టైనింగ్ గ్యారెంటీ అని ప్రేక్షకులను భావిస్తుంటారు. అయితే ‘గద్దల కొండ గణేష్’ తర్వాత ఇప్పటి వరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. మధ్యలో పవన్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో బిజీగా ఉండటంతో కాస్త సమయం పట్టేలా ఉంది. దాంతో హరీష్ మరో హీరో కోసం వెతుకులాట ప్రారంభించాడు. అయితే హరీష్‌తో ఇప్పుడు స్టార్ హీరోలు సినిమా చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌లు అయిపోయేలోపు దాదాపు రెండు, మూడేళ్ళయినా పడుతుంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ ఓ బాలీవుడ్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.
హరీష్ శంకర్ తన తదుపరి సినిమాను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. దాని కోసం ముంబై కూడా వెళ్లాడట. త్వరలోనే సల్మాన్‌ను కలిసి కథ కూడా నెరేట్ చేయనున్నట్లు టాక్. అన్ని కుదరితే ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం . మరీ సల్మాన్.. హరీష్ కథను ఒకే చేస్తాడా? లేదా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం హరీష్ ‘ఏటీఎమ్’ అనే వెబ్‌సిరీస్‌కు నిర్మాతగా పనిచేస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు దిల్‌రాజు కూతురు హర్షితా రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది.
Read Also:
Brahmastra | ఓటీటీలోకి వచ్చేసిన ‘బ్రహ్మస్త్ర’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Kantara Movie | తెలుగు స్టేట్స్లో ‘కాంతార’ మూవీ సరికొత్త రికార్డు..!
Godfather Movie | అప్పుడే ఓటీటీలోకి ‘గాడ్‌ఫాదర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Rajinikanth | కూతురు డైరెక్షన్లో రజనీకాంత్ నెక్స్ట్ సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

