Akshay Kumar | తొలిసారి మరాఠా మూవీలో అక్షయ్ కుమార్..!
Veer Daudale Saat Movie | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తుంటాడు. అంతేకాకుండా ఏ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు.
Veer Daudale Saat Movie | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తుంటాడు. అంతేకాకుండా ఏ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన 5 సినిమాలు రిలీజైయ్యాయి. అయితే ఈ ఐదు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మూడు సినిమాలకు పాజిటీవ్ టాక్ వచ్చినా, వేరే సినిమాలతో పోటీని తట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలాయి. ఇక ప్రస్తుతం అక్షయ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. కాగా తాజాగా మరో సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
‘వీర్ దౌడ్ లే సాత్’ అనే మారాఠా మూవీలో అక్షయ్‌కుమార్ నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం అక్షయ్‌కు తొలి మరాఠా మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ పాత్రలో నటించనున్నాడు. మహేష్ మంజ్రేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మరాఠా భాషలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఖురేషీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వజీమ్ ఖురేషీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

