ఐటీఆర్ ఫైలింగ్‌కు న్యూ పోర్టల్.. వెంటాడుతున్న టెక్నికల్ సమస్యలు!
ఐటీఆర్ ఫైలింగ్‌కు న్యూ పోర్టల్.. వెంటాడుతున్న టెక్నికల్ సమస్యలు!| ఆదాయం పన్నుశాఖ నూతన పోర్టల్ ప్రారంభించి వారం దాటినా.. సాంకే తిక సమస్యలు.....

న్యూఢిల్లీ: కొత్తగా ఆదాయం పన్నుశాఖ (ఐటీ) ప్రారంభించిన ఈ -ఫైలింగ్ పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పోర్టల్ ప్రారంభమై వారమైనా ఇంకా సాంకేతిక సమస్యలు వీడలేదని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పోర్టల్‌లోకి లాగిన్ కావడానికి సాధారణం కంటే ఎక్కువ టైం పడుతున్నదని పలువురు చార్టెడ్ అకౌంటెంట్లు చెబుతున్నారు.
పన్ను రిటర్న్‌ల దాఖలు ప్రక్రియను సులభతరం చేస్తున్నామంటూ ఈ నెల ఎనిమిదో తేదీన ఐటీ శాఖ కొత్త పోర్టల్ http://www.incometax.gov.in ను అందుబాటులోకి తెచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తొలిరోజే దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనికి సూచించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఇన్ఫోసిస్ క్రుషి చేస్తున్నదని నిలేకని బదులిచ్చారు.
ఇదంతా జరిగి వారం గడుస్తున్నా ఇంకా పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయని, పలు ఫీచర్లు పనిచేయడం లేదని పలువురు చార్టెట్ అకౌంటెంట్లు అంటున్నారు. లాగిన్‌కే సాధారణం కంటే ఎక్కువగా దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పడుతున్నదని సీఏలు పేర్కొంటున్నారు.
‘ఈ- ప్రొసీడింగ్స్’ విభాగంలోకి వెళితే ‘కమింగ్ సూన్’ అనే సందేశం కనిపిస్తున్నదన్న విమర్శ వినిపిస్తున్నది. కొత్త పోర్టల్ వేగంగా ఉంటుందనుకుంటే మునుపటి కంటే నెమ్మదిగా ఉందని, పాత ఫీచర్లు సైతం సరిగా పనిచేయడం లేదు
చివరకు పాస్వర్డ్ మార్చాలన్నా కొన్ని నిమిషాల పాటు వేచి చూడాల్సి వస్తుందని మరొక చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పారు. గతంలో దాఖలు చేసిన ఈ-ఫైలింగ్ రిటర్న్స్ కూడా కనిపించడం లేదని పలువురు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తొలగించాలని కోరుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- incom tax
- new portal
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

