Bank Holidays | బ్యాంకులో ఏమన్నా పనులుంటే వెంటనే చేసుకోండి..! సెప్టెంబర్ 15 రోజుల పాటు బ్యాంకులు మూతే..!
Bank Holidays | సెప్టెంబర్ మాసంలో దాదాపుగా సగం రోజులు బ్యాంకులు మూసే ఉండనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది.
Bank Holidays | సెప్టెంబర్ మాసంలో దాదాపుగా సగం రోజులు బ్యాంకులు మూసే ఉండనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 15 రోజులు సెలవులు రానున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంక్, యూపీఐ సర్వీసులు యథావిధిగా పని చేయనున్నాయి. అయితే, కొన్ని అవసరాల కోసం తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్స్ సైతం అందుబాటులో ఉంచాయి. ఇందులో అకౌంట్లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలుంటుంది. మరి సెప్టెంబర్లో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయో తెలుసుకుందాం రండి..!
సెప్టెంబర్లో సెలవుల జాబితా ఇదే..
- సెప్టెంబర్ 3 : కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్లో బ్యాంకుల మూసివేత.
- సెప్టెంబర్ 4 : ఫస్ట్ ఓనమ్ నేపథ్యంలో కేరళలో హాలీడే.
- సెప్టెంబర్ 5 : ఈద్ ఇ మిలాద్, తిరువోన్నమ్ సందర్భంగా హైదరాబాద్, ఏపీ, కేరల, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్.
- సెప్టెంబర్ 6 : ఈద్- ఇ మిలాద్, ఇంద్రజాత్ర నేపథ్యంలో సిక్కిం, ఛత్తీస్గఢ్లో హాలీడే.
- సెప్టెంబర్ 7 : ఆదివారం సందర్భంగా సాధారణ సెలవు.
- సెప్టెంబర్ 12 : ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- సెప్టెంబర్ 13 : రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్.
- సెప్టెంబర్ 14 : ఆదివారం బ్యాంకులకు హాలీడే.
- సెప్టెంబర్ 21 : ఆదివారం కావడంతో సాధారణ హాలీడే.
- సెప్టెంబర్ 22 : దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా రాజస్థాన్లో బ్యాంకులకు సెలవు.
- సెప్టెంబర్ 23 : మహరాజ్ హరిసింగ్ సందర్భంగా జమ్మూ కశ్మీర్లో హాలీడే.
- సెప్టెంబర్ 27 : నాలుగో శనివారం సందర్భంగా సెలవు.
- సెప్టెంబర్ 28 : ఆదివారం కావడంతో సెలవు.
- సెప్టెంబర్ 29 : మహా సప్తమి, దుర్గ పూజ నేపథ్యంలో త్రిపుర, అసోం, బెంగాల్లో హాలీడే.
- సెప్టెంబర్ 30 : దుర్గాష్టమి నేపథ్యంలో త్రిపుర, ఒడిశా, అసోం, మణిపూర్, బెంగాల్, బిహార్, జార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో హాలీడే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

