బాస్ అంటే మినిమం ఇలా ఉండాల..!
ఉద్యోగులంటే జీతం తీసుకుని మన కింద పనిచేసే బానిసలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్న రోజుల్లో ఓ అమెరికన్ కంపెనీ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకుని వారికి అండగా ఉంటూ గౌరవించాలని చెబుతున్నాడు.
న్యూయార్క్ : ఉద్యోగులంటే జీతం తీసుకుని మన కింద పనిచేసే బానిసలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్న రోజుల్లో ఓ అమెరికన్ కంపెనీ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకుని వారికి అండగా ఉంటూ గౌరవించాలని చెబుతున్నాడు. ఉద్యోగులు పనిచేసినందుకు కేవలం శాలరీ ఇస్తే సరిపోదని వారి పనికి గౌరవం కూడా దక్కాలంటాడాయన. అమెరికాలోని సీటెల్‌కు చెందిన సీఈఓ తన ఉద్యోగులకు ఏకంగా 80,000 డాలర్లు అంటే రూ 63.7 లక్షల కనీస వేతనం చెల్లిస్తున్నారు.
అంతేకాదు ఉద్యోగులు తమకు నచ్చిన చోటు నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాడు. సీటెల్‌లోని గ్రావిటీ పేమెంట్స్ సీఈఓ డాన్ ప్రైస్ ఉద్యోగులను సొంతబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఉద్యోగులకు సరైన వేతనాలను చెల్లిస్తూ వారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించేలా తన తరహాలో ఇతర సంస్ధలూ నడుచుకోవాలని డాన్ ప్రైస్ చెబుతున్నారు. తన కంపెనీ ఉద్యోగులకు కనీసం రూ 63.7 లక్షల వేతనం చెల్లిస్తుందని, వారికి ఇతర ప్రయోజనాలతో పాటు పేరెంటల్ లీవ్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయని ప్రైస్ చెప్పారు.
My company pays an $80k min wage, lets people work wherever they want, has full benefits, paid parental leave, etc.
We get over 300 applicants per job.
"No one wants to work" is a hell of a way of saying "companies won't pay workers a fair wage and treat them with respect."
— Dan Price (@DanPriceSeattle) August 8, 2022
ఒక్కో ఉద్యోగానికి తమకు 300కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని ట్విట్టర్లో ఓ వైరల్ పోస్ట్‌లో ఆయన రాసుకొచ్చారు. ఉద్యోగులకు సరైన వేతనం, గౌరవం దక్కని చోట పనిచేయాలని ఏ ఒక్కరూ అనుకోరని అన్నారు. ట్విట్టర్లో ప్రైస్ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా నెటిజన్లు పెద్దసంఖ్యలో స్పందించారు. ఉద్యోగులకు సరైన వేతనం చెల్లిస్తూ వారిని బాగా చూసుకోవాలని ఓ యూజర్ కామెంట్ చేయగా, మీ లాంటి బాస్‌లు ఉండటం ఉద్యోగుల అదృష్టమని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

