Durga Temple | విజయవాడలో కన్నులపండువగా అమ్మవారి ఊరేగింపు
Durga Temple | విజయదశమి సందర్భంగా విజయవాడ దుర్గామాత ఆలయంలో అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది.

విజయవాడ: విజయదశమి సందర్భంగా విజయవాడ దుర్గామాత ఆలయంలో అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. జలవిహారం లేకుండానే తెప్పోత్సవం నిర్వహించనున్నారు.. ఈ వేడుకను తిలకించేందుకు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి లభించింది.
దుర్గాఘాట్, పున్నమిఘాట్, ఫ్లైఓవర్ నుంచి ఈ తెప్పోత్సవం దర్శించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతానికి ఉత్సవమూర్తులు దుర్గాఘాట్ చేరుకున్నాయి. కాసేపట్లో హంసవాహనంపై ఆదిదంపతులకు పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇదిలా వుండగా, విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. దేవీ నవరాత్రుల చివరి రోజు కావడంతో క్యూలైన్లలో రద్దీ విపరీతంగా ఉంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రద్దీతో ఇబ్బందులు పడుతున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

