Chandrababu-Pawan Kalyan | టీడీపీ సూపర్ సిక్స్.. జనసేన షణ్ముఖ వ్యూహం.. ఇదే ఉమ్మడి మేనిఫెస్టో..?!
Chandrababu-Pawan Kalyan | Chandrababu-Pawan Kalyan | 12 అంశాలతో టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.
Chandrababu-Pawan Kalyan | 12 అంశాలతో టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. జనసేన షణ్ముఖ వ్యూహం.. టీడీపీ సూపర్ సిక్స్ అనే పేరుతో వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు డిన్నర్ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో జనసేన సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చల్లో త్వరలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక వారి మధ్య మరో ఆసక్తికర చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. టీడీపలో అసెంబ్లీ లేదా లోక్‌సభ టికెట్ కోసం చంద్రబాబుకు పవన్ కల్యాణ్‌తో ఒక మాట చెప్పించడానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. అందుకోసం ఇటీవల పవన్ కల్యాణ్‌ను టీడీపీ నేతలు జలీల్ ఖాన్, వేదవ్యాస్, మాగంటి బాబు కలిశారు. మరి కొందరు టీడీపీ నేతలు భేటీ కోసం అపాయింట్ మెంట్ అడుగుతున్నారని చంద్రబాబుతో పవన్ చెప్పారని తెలుస్తోంది. వారితో మాట్లాడాల్సిన అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు తెలియవచ్చింది.
ఇక అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నేతలను, వైసీపీ నేతలను చేర్చుకునే అంశాలపై చర్చ వారిద్దరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి వెళ్తే కలిగే లాభ నష్టాలపై ఫోకస్ చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారని తెలిసింది. బీజేపీతో ఆచితూచీ స్పందించాలని అభిప్రాయానికి వచారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో తమకు ఎదురైన అనుభవాలను వారు విశ్లేషించుకున్నారని వినికిడి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

