(Suicide attempt) వేములవాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది. రక్తంతో వీరిని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వగా.. వెంటనే వారిని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పరిధిలోని దమ్మన్న గ్రామానికి చెందిన ఓ వివాహిత.. 15 రోజుల క్రితం తల్లి ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో తన ఇద్దరు పిల్లలు వరుణ్‌తేజ, అక్షయలను తీసుకుని వేములవాడకు చేరింది. అయితే, ఉన్నట్టుండి తన ఇద్దరు పిల్లల గొంతు కోసింది. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. రక్తం కారుతూ పడిపోయిన వీరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ముగ్గురిని స్థానిక దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని సిరిసిల్ల దవాఖానకు తరలించడంతో వైద్యులు వారికి చికిత్స చేశారు. ఎక్కువ రక్తం కారిపోక ముందే దవాఖానకు తీసుకురావడంతో వారి ప్రాణాలు నిలిచాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సంఘటనకు పాల్పడినట్లు గా సమాచారం
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..