గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
నాలుగు నెలల క్రితం మా పెద్దమ్మకు గర్భ సంచిలో గడ్డలు వచ్చాయని డాక్టర్లు చెప్పారు. అవి పెద్దవిగా ఉన్నాయని, సర్జరీ చేయాలని అన్నారు. అసలు గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి? అలా వస్తే పిల్లలు పుట్టడం సాధ్యమేనా?
ఓ సోదరి

జ: గర్భ సంచిలో గడ్డలు రావడానికి అనేక కారణాలు. ఒకటి జన్యు పరంగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు కూడా కారణం అవుతాయి. అంటే, ఫైబ్రాయిడ్స్ మీద ఈస్ట్రోజన్ రిసెప్టార్లు ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ల శాతం ఎక్కువైనప్పుడు రిసెప్టార్లు యాక్టివేట్ అయిపోయి, ఫైబ్రాయిడ్ల పరిమాణం పెరుగుతుంది. కొన్నిసార్లు ఈస్ట్రోజన్ వల్ల ఫైబ్రాయిడ్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అందువల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్.. రెండిటి ప్రభావం వీటిపైన ఉంటుంది. ఈ గడ్డల వల్ల సంతానలేమి సమస్య వస్తుంది. గర్భాశయం లోపల, గోడల పొరల్లో, ముఖద్వారం దగ్గర.. ఎక్కడ గడ్డలున్నా, పిండం తయారు కాదు. అందుకే, గడ్డలు ఉన్నవారికి గర్భధారణ అసాధ్యమని చెబుతారు. కొంతమందికి పిల్లలు పుట్టాక గర్భసంచి లోపల చిన్నచిన్న గడ్డలు వస్తాయి.
అప్పటికే పిల్లలు ఉంటారు కాబట్టి, ఎలాంటి చికిత్స తీసుకున్నా ఇబ్బంది ఉండదు. ఒకవేళ సంతానం కలగకముందే గర్భసంచిలోపల గడ్డలు వస్తే, వాటిని హిస్టెరోస్కోపిక్ రిసెక్షన్ ద్వారా తొలగిస్తారు. ఆ తర్వాత గర్భధారణకు వెళ్లొచ్చు. అయితే అన్నిరకాల గడ్డలు మందులతో కరిగిపోవు. గోడల్లో రెండు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న గడ్డలు మాత్రమే మందులతో కరిగిపోతాయి. అదే గోడల్లో 4-5 సెంటీమీటర్ల పరిమాణంలో గడ్డలు ఉంటే, మూడు నెలలు జీఎన్ఆర్హెచ్ అనలాగ్ ఇంజెక్షన్లు ఇస్తారు. గడ్డల పరిమాణం పెరగకుండా, జీవం లేకుండా మెత్తబడిపోయేలా చేస్తాయవి. అలా జరిగినప్పుడు సర్జరీ సులువు అవుతుంది. ఆ మూడు నెలలు నెలసరి రాకుండా, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈలోపు రక్త హీనత సమస్య ఉంటే సరిచేసుకోవచ్చు. అయితే ఒక విషయం. ఐదు సెంటీమీటర్ల కంటే పెద్ద గడ్డలపై ఈ ఇంజెక్షన్లు ఏమాత్రం పని చేయవు. శస్త్రచికిత్స తప్పకపోవచ్చు కూడా.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

