children crying | పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
children crying | నవజాత శిశువులు అటూ ఇటూ కదులుతూ ఏడుస్తుంటారు. ఓ పది నిమిషాలు ఏడిస్తే నష్టమేమీ లేదు. ఎక్కువసేపు కొనసాగితే మాత్రం కారణం వెదకాలి. రాత్రిపూట బిడ్డలు మధ్యలో లేచిన వెంటనే పాలు తాగించకూడదు. కొద్దిసేపటికి తమంతట తామే నిద్రలోకి జారుకుంటారు. లేచీలేవగానే పాలు పట్టిస్తే, అదే అలవాటుగా మారుతుంది.

పడకగదిలో కొంత వెలుతురు ఉంటే శిశువులు భయపడకుండా నిద్రపోతారు. కొంతమంది తెల్లవారుజామునే లేస్తుంటారు. అలాంటి పిల్లలకు త్వరగా మెలకువ రాకుండా ఉండాలంటే.. పడకగది కిటికీల నుంచి వెలుతురు రాకుండా పరదాలు వేయాలి. త్వరగా లేచే అలవాటు ఉంటే, రాత్రి త్వరగానే నిద్రపుచ్చాలి.
☞ వయసు పెరుగుతున్న కొద్దీ బిడ్డలో భయాందోళనలు ప్రారంభం అవుతాయి. 8-9 నెలల శిశువు ఒకటి రెండు గంటల నిద్ర తరువాత హఠాత్తుగా లేచి ఏడుస్తుంది. కొంత సేపు తల్లిని చూసి తిరిగి నిద్రపోతుంది. ఈ సమస్య కొద్ది రోజులలో తగ్గిపోతుంది. ఉదయం, సాయంత్రం చిరునిద్ర పోయినా.. రాత్రి 12 గంటలు దాటాకే పడుకుంటారు.
☛ కొందరు శిశువులు ఆకలి, అలసట, అసౌకర్యం లేకున్నా నస పెడుతుంటారు. ఆ నస కొంతసేపు కొనసాగి, ఆ తరువాత తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో నిక్షిప్తమైన శక్తి విడుదల అవుతుంది. శిశువు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.
☞ ఏడుపులో రకరకాలు. బిడ్డ పెరుగుతున్న కొద్దీ తల్లికి కారణాలు, అవసరాలు అర్థం అవుతాయి. ఏడుపు కూడా వయసుతోపాటు మారుతుంది. ఏడుపు మాన్పించే ఉత్తమ మార్గం.. ఎత్తుకొని, ఆకలిగా ఉంటే పాలు తాగించడం. ఎత్తుకున్నా మాననట్లయితే ఊయలలో వేసి ఊపవచ్చు. వీపుపై నెమ్మదిగా తడుతూ జోలపాట పాడవచ్చు. కబుర్లు చెప్పడం, సంగీతం వినిపించడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం వల్ల కూడా ఏడుపు ఆపవచ్చు. అయినా ఆపకపోతే, తల్లి కాకుండా వేరెవరైనా ఎత్తుకోవాలి.
☛ జ్వరం ప్రారంభ దశలో.. మనం గుర్తించేలోపే శారీరక నొప్పుల వల్ల శిశువులు ఏడుస్తుంటారు. జ్వరం తగ్గగానే ఏడుపు ఆగిపోతుంది. కొందరు శిశువులు నిద్రలోకి జారుకునే ముందు కొంతసేపు ఏడుస్తుంటారు.
☞ శిశువు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందకూడదు. కోపంతో కొట్టడమూ సరికాదు. కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. దీనివల్ల తల్లికి తగిన విశ్రాంతి దొరకడమే కాకుండా, కొత్త ముఖాలు చూసి శిశువు ఏడుపు మానవచ్చు.
☛ కొన్నిసార్లు శిశువు నిద్రలో కదులుతున్నప్పుడు.. మెలకువ వచ్చిందనుకుని ఎత్తుకోకూడదు. దీనివల్ల బిడ్డ నిద్ర తేలిపోతుంది. తిరిగి నిద్రలోకి జారుకోవడం కష్టమవుతుంది. కదిలినప్పుడల్లా లేపకుండా, అలాగే ఉంచి జోకొడితే తిరిగి నిద్రపోతారు. పసిబిడ్డలకు తగినంత నిద్ర చాలా అవసరం.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Infant crying | చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తారు?
Omicron | ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
పేరెంట్స్ బీకేర్‌ఫుల్.. మీ కోపంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించారా?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

