DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. రష్యా తరఫు మధ్యవర్తిగా మాజీ సీజేఐ చంద్రచూడ్
DY Chandrachud | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ (Ukraine) కు చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు 'ఓస్చాడ్‌బ్యాంక్ (Oschadbank)' తో నెలకొన్న పెట్టుబడుల వివాదంలో రష్యా తమ తరఫు మధ్యవర్తి (Arbitrator) గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించింది.
DY Chandrachud : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ (Ukraine) కు చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు ‘ఓస్చాడ్‌బ్యాంక్ (Oschadbank)’ తో నెలకొన్న పెట్టుబడుల వివాదంలో రష్యా తమ తరఫు మధ్యవర్తి (Arbitrator) గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించింది. ఈ వివాదంపై 1998లో రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద విచారణ జరుగుతోంది.
రష్యా సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిఝియా ప్రాంతాల్లో తమ ఆస్తులకు, కార్యకలాపాలకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ఓస్చాడ్‌బ్యాంక్ ఈ కేసు దాఖలు చేసింది. ముఖ్యంగా 2022 తర్వాత జరిగిన పరిణామాలతో వందల మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని పరిహారం కోరుతోంది. ఈ మేరకు 2025 జూలైలో వివాద పరిష్కారం కోసం రష్యాకు నోటీసులు పంపినా స్పందన రాకపోవడంతో అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇరుపక్షాల అంగీకారంతో కోస్టారికాకు చెందిన డయాలా జిమెనెజ్ ధర్మాసనానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఉక్రెయిన్ బ్యాంకు తరఫున గ్రీక్ ఆర్బిట్రేటర్ స్టవ్రోస్ బ్రెకౌలాకిస్‌ను నియమించారు. ఇప్పుడు రష్యా తమ ప్రతినిధిగా జస్టిస్ చంద్రచూడ్‌ను ఎంపిక చేసింది. గతంలో ఇలాంటి ఇతర వివాదాల్లో రష్యా చేసిన విజ్ఞప్తులను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించడం గమనార్హం. అయితే ఈసారి ఆయన నియామకాన్ని అంగీకరించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

