అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు | సాధారణంగా నీళ్లలో ఈత కొట్టాలంటే ఖచ్చితంగా ఈత రావాల్సిందే. లేదంటే మునిగిపోతారు. కానీ.. ఈ పూల్‌లో మాత్రం మనుషులు మునిగిపోరు. ఈత రాని వాళ్లు కూడా నీటి మీద తేలియాడుతారు
సాధారణంగా నీళ్లలో ఈత కొట్టాలంటే ఖచ్చితంగా ఈత రావాల్సిందే. లేదంటే మునిగిపోతారు. కానీ.. ఈ పూల్‌లో మాత్రం మనుషులు మునిగిపోరు. ఈత రాని వాళ్లు కూడా నీటి మీద తేలియాడుతారు. అక్కడ ఉన్న ఏ పూల్‌లో అయినా అంతే. దానికి కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ పూల్స్ ఎక్కడున్నాయి అంటారా? ఈజిప్ట్‌లోని సివా ఒయాసిస్‌లో ఉన్న పూల్స్ గురించే మనం మాట్లాడుకునేది. అక్కడ ఎక్కువగా సాల్ట్ పూల్స్ ఉంటాయి. సముద్రపు నీటి కంటే కూడా ఆ నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయి. అందుకే వాటిని సాల్ట్ పూల్స్ అంటారు.

అయితే.. ఆ సాల్ట్ పూల్స్‌లోకి దిగితే ఈత వచ్చినా రాకున్నా.. మనిషి అందులో మునగడు. ఏ వస్తువు వేసినా కూడా మునగదు. మనుషులు నీటి మీద తేలియాడుతారు. ఈత కొట్టకుండా.. నీళ్ల మీద అలాగే పడుకోవచ్చు. దానికి కారణం.. ఆ నీళ్లలో ఉండే ఉప్పు సాంద్రత. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. ఉప్పు సాంద్రత ఆ నీటిలో అత్యధికంగా ఉండటం వల్ల.. ఆ నీటిలోకి ఏ వస్తువూ మునగదు. మనుషులు కూడా అంతే. సివా ఒయాసిస్‌లో ఇటువంటి సాల్ట్ పూల్స్ వందలకొద్దీ ఉన్నాయి.
ఈ సాల్ట్ పూల్స్‌లోకి దిగి కాసేపు నీటిలో ఉంటే.. చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కంటి ఇన్ఫెక్షన్ సంబంధ సమస్యలు, సైనస్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయట. ఇదంతా నిజమేనా.. నమ్మేటట్టుగా లేదు.. మనుషులు తేలియాడటం ఏంటి.. అని ఇంకా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి.
Siwa Oasis, Egypt. The intense salt concentration means you can’t sink in the water. 👀 pic.twitter.com/xtgUyZl4RC
— W O R L D W I D A 🌎 (@worldwida_) December 5, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెంపుడు పిల్లికి బర్త్‌డే గిఫ్ట్‌గా 4 లక్షల విలువైన గోల్డ్ లాకెట్
పెంపుడు కుక్కకు సీమంతం : అతిథులకు కమ్మని విందు.. పండుగలా వేడుక.. ఆశ్చర్యపోయిన స్థానికులు
Viral Video: వార్నీ.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. చికెన్ వింగ్స్‌ను ఎలా జుర్రేశాడో చూడండి
పచ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

