ఈరోజుల్లో చాలామందికి పెంపుడు జంతువుల మీద చాలా ఇష్టం పెరుగుతోంది. కొందరైతే తమ పెంపుడు జంతువులను సొంత మనుషుల్లా చూస్తారు. వాటి కోసం ఏదైనా చేస్తారు. ఇటీవలే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క గర్భం దాల్చిందని దానికి ఏకంగా సీమంతం చేశాడు. ఆకాశమంత పందిరి వేసి.. సెలబ్రేట్ చేసుకున్నాడు.
తాజాగా.. ఓ మహిళ తన పెంపుడు పిల్లి బర్త్‌డేకు కాస్ట్లీ గిఫ్ట్‌నే ఇచ్చింది. రూ.4 లక్షలు పెట్టి పిల్లి కోసం గోల్డ్ లాకెట్ చేయించింది. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. హలిజా మైసూరీ ఇటీవలే తన పెంపుడు పిల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసింది. దాని పేరు మనీ. దాని నాలుగో పుట్టిన రోజును అంగరంగవైభవంగా నిర్వహించింది. తన పెంపుడు పిల్లి కోసం లక్షలు ఖర్చు పెట్టడం తనకు ఇదే కొత్తేమీ కాదు. తాజాగా ఆ పిల్లి బర్త్‌డే రోజు హలిజా, తన భర్త.. సుమారు రూ.4.5 లక్షల విలువైన గోల్డ్ లాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
దీనితో పాటు హలిజా దగ్గర మరో రెండు పిల్లులు కూడా ఉన్నాయట. తను వెకేషన్‌కు వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా పెట్ క్యాట్స్‌ను కూడా తనతో పాటే తీసుకెళ్తుందట. అవి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదట హలిజా.
తన పెంపుడు పిల్లులకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పుడూ హలిజా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా.. ఆ క్యాట్‌కు కొనిచ్చిన గోల్డ్ లాకెట్‌ను తన టిక్‌టాక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అవడం.. తన పెంపుడు పిల్లికి లక్షల విలువ చేసే లాకెట్‌ను ఆ మహిళ గిఫ్ట్‌గా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెంపుడు కుక్కకు సీమంతం : అతిథులకు కమ్మని విందు.. పండుగలా వేడుక.. ఆశ్చర్యపోయిన స్థానికులు
Viral Video: వార్నీ.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. చికెన్ వింగ్స్‌ను ఎలా జుర్రేశాడో చూడండి
పచ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు.. వైరల్ వీడియో
కోవిడ్ రిలీఫ్ లోన్ తీసుకొని లంబోర్ఘిని కారు, రొలెక్స్ వాచ్ కొన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?