పెంపుడు కుక్కకు సీమంతం : అతిథులకు కమ్మని విందు.. పండుగలా వేడుక.. ఆశ్చర్యపోయిన స్థానికులు
పెంపుడు కుక్కకు సీమంతం | సాధారణంగా సీమంతం ఎవరికి చేస్తారు. గర్భిణీ స్త్రీలకు చేస్తారు. అది మనుషుల సంప్రదాయం. కానీ.. కుక్కలకు ఎవరైనా సీమంతం చేస్తారా
సాధారణంగా సీమంతం ఎవరికి చేస్తారు. గర్భిణీ స్త్రీలకు చేస్తారు. అది మనుషుల సంప్రదాయం. కానీ.. కుక్కలకు ఎవరైనా సీమంతం చేస్తారా? ఎవ్వరూ చేయరు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం తాను పెంచుకుంటున్న కుక్క గర్భం దాల్చిందని తెలిసి ఎగిరి గంతేశాడు. అంతే కాదు.. దానికి సీమంతం కూడా చేశాడు.

సీమంతాన్ని ఏదో సాదాసీదాగా చేశాడనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఆకాశమంత పందిరి వేసి.. బంధుమిత్రుల మధ్య అంగరంగవైభవంగా దాని సీమంతాన్ని నిర్వహించాడు. వేడుక తర్వాత సీమంతానికి వచ్చిన అతిథులకు కమ్మని భోజనం కూడా పెట్టాడు.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటారా? తమిళనాడులోని మదురై జిల్లాలో. జైహింద్పురంలో నివసించే శక్తివేల్ పోలీస్ ఆఫీసర్. తను సుజి అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అది ఆడకుక్క. అది ఇటీవల గర్భం దాల్చడంతో దానికి గర్భిణీలకు ఎలా సీమంతం చేస్తారో అదే సంప్రదాయంతో సీమంతం నిర్వహించాడు. ముత్తైదువులను పిలిచి కుక్కకు అలంకరణ చేశారు. గాజులు తొడిగారు. కుంకుమతో బొట్టు పెట్టారు. మెడలో పూలదండ వేశారు.
సుజి.. మా ఇంట్లో ఒక మనిషిలా చూస్తాం. దానికి మేం ఏం తింటామో.. అదే పెడతాం. అది గర్భం దాల్చిందని తెలిసి చాలా సంతోషించాం. అందుకే దానికి మా ఆడవాళ్లకు ఎలా సీమంతం చేస్తామో అలాగే నిర్వహించాం.. అని శక్తివేల్ చెప్పుకొచ్చాడు.
కుక్కకు సీమంతం చేసి.. శక్తివేల్ స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. కాకపోతే కొందరు మాత్రం కుక్కకు సీమంతం ఏంది.. అంటూ పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా.. కుక్కకు సీమంతం చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు కూడా ఆ ఫోటోలు, వీడియోలను చూసి అవాక్కవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video: వార్నీ.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. చికెన్ వింగ్స్ను ఎలా జుర్రేశాడో చూడండి
పచ్చి మిర్చీతో ఐస్క్రీమ్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు.. వైరల్ వీడియో
కోవిడ్ రిలీఫ్ లోన్ తీసుకొని లంబోర్ఘిని కారు, రొలెక్స్ వాచ్ కొన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
డియర్ ఆనంద్ మహీంద్రా.. మీ ఎలక్ట్రిక్ ఆటో బాగుంది.. కానీ
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

