ఇది ఎలక్ట్రిక్ వాహనాల యుగం. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ వాహనాల కోసం చూస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. మహీంద్రా కంపెనీ నుంచి ఇప్పటికే ఎలక్ట్రిక్ ఆటోలు కూడా లాంచ్ అయ్యాయి. బడ్జెట్ ధరలో మహీంద్రా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఆటోల సేల్స్ కూడా బాగానే ఉన్నాయి.
ఈనేపథ్యంలో మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను స్వయంగా నడిపి.. దాంట్లో ఇంకా మెరుగులు దిద్దడం కోసం కొన్ని సూచనలు చేశాడు జోహో సీఈవో శ్రీధర్ వెంబు. జోహో కంపెనీ టెక్నాలజీకి చెందిన కంపెనీ. దాని సీఈవో మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను స్వయంగా నడిపి.. దానిపై రివ్యూను ఏకంగా ఆనంద్ మహీంద్రాకే పంపించాడు.
మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోను నిన్ననే కొనుగోలు చేశాను. ఒక్కసారి చార్జ్ చేస్తే 125 కిమీలు ప్రయాణం చేయొచ్చు. గంటకు 55 కిమీల స్పీడ్‌లో ప్రయాణించవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే.. ఈ ఆటోను ఇంకాస్త మెరుగుపరచవచ్చు. దాని కోసం నేను మీకు కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను.. అంటూ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశాడు శ్రీధర్.
డిజైన్ బాగుంది. ధర పరంగా చూసినా.. దీన్ని ప్రతి ఫ్యామిలీ సులభంగానే కొనుగోలు చేయొచ్చు. ఎక్కువ సంఖ్యలో తీసుకుంటే ధర కూడా తగ్గే అవకాశం ఉంది. నేను గ్రామీణ ప్రాంతాల్లో ఆటోను నడుపుతూ వెళ్తుంటే.. దాన్ని చూసిన అక్కడి స్థానికులు.. ఈ ఆటో ఎక్కడ దొరుకుతుంది అంటూ నన్ను అడిగారు.
ఇది ఎలక్ట్రిక్ వాహనాల యుగం కాబట్టి.. ఇంకా రకరకాల డిజైన్స్, కలర్లతో ఆటోను డిజైన్ చేయండి. ఇంకా.. ఫ్యామిలీ, పిల్లల కొసం కొన్ని ప్రత్యేకమైన ఆఫ్షన్లను ఆటోలో ఇవ్వండి. అలాగే.. అత్యంత తక్కువ ధరకే దొరుకుతున్న ఈ ఎలక్ట్రిక్ ఆటోను ప్రజలందరికీ పరిచయం చేయడం కోసం బెస్ట్ మార్కెటింగ్ ఆలోచన చేయండి. ఆ ఆటోలకు త్వరలోనే డిమాండ్ పెరుగుతుంది.. అంటూ ట్వీట్లు చేశాడు శ్రీధర్.
శ్రీధర్ ట్వీట్లకు ఇంకా ఆనంద్ మహీంద్రా స్పందించకపోయినప్పటికీ.. నెటిజన్లు అయితే.. మంచి సూచనలు చేశారు సార్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బీరు టిన్‌లో తల దూర్చిన నాగుపాము.. బయటికి రాలేక తిప్పలు.. వైరల్ వీడియో
లక్కంటే ఆ పిల్లాడిదే.. ఒక్క క్షణం ఆలస్యమైనా పిల్లాడి ప్రాణాలు పోయేవి: వైరల్ వీడియో
బాలీవుడ్ సాంగ్‌కు ఎయిర్‌హోస్టెస్ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
వాఘా బార్డర్ వద్ద పుట్టాడని తన కొడుకుకు ‘బార్డర్’ అని పేరు పెట్టిన పాకిస్థానీ మహిళ
స్కై సర్ఫింగ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 13500 ఫీట్ల ఎత్తు నుంచి దూకి.. వైరల్ వీడియో