మామూలుగా సర్ఫింగ్ ఎక్కడ చేస్తారు? మంచు మీద చేస్తారు. కానీ.. స్కై మీద అంటే ఆకాశంలో సర్ఫింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఆకాశంలో సర్ఫింగ్ చేయడం మాత్రమే కాదు.. ఆకాశంలో తలకిందులుగా నిలబడి.. హెలికాప్టర్ రొటేషన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఒకటి కాదు..రెండు కాదు.. అలా 160 హెలికాప్టర్ రొటేషన్స్ చేసి.. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు యూఎస్‌కు చెందిన ఎడ్వర్డ్ స్నైడర్.
యూఎస్‌లో ఉన్న అతి కొద్ది స్కైసర్ఫర్స్లో ఎడ్వర్డ్ ఒకరు. స్కై డైవింగ్‌లో సర్ఫింగ్ చేయడం అనేది ఎంతో సాహసంతో కూడుకునేది. దాన్ని చేసి నిరూపించి.. ఇప్పటి వరకు చాలా నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో గెలిచాడు. తాజాగా తన స్కైసర్ఫింగ్ టాలెంట్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనుకున్నాడు. అందుకే నవంబర్ 1, 2021 న 13,500 ఫీట్ల ఎత్తు నుంచి జంప్ చేసి.. ఎక్కువ హెలికాప్టర్ రొటేషన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్‌ను ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ వద్ద సాధించాడు. ఈ ఫీట్ సాధనలో ఎడ్వర్డ్‌కు స్కైడైవ్ ఈజిప్ట్, స్కైడైవ్ ఆరెంజ్, బ్రునో బ్రోకెన్, ఒమర్ అల్హెగెలాన్ టీమ్ సభ్యులు సహకరించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఎడ్వర్డ్ పేరును గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించి… అతడికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. అలాగే.. అతడు చేసిన ఫీట్‌కు సంబంధించిన వీడియోను తమ యూట్యూబ్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఆ వీడియో చూస్తుంటే మాకే భయమేసింది. ఇంకో వంద జన్మలు ఎత్తినా నేనైతే ఆ సాహసానికి ఒడిగట్టను.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chole Bhature : అక్కడ ప్లేట్ ‘చోలె భటురే’ ధర రూ.1000… టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా?
Fire Panipuri: ఫైర్ పానీపూరీ.. అక్కడ ఇదే స్పెషల్.. ఎలా తినాలో తెలుసా?
పెళ్లి జరుగుతుండగా.. పెళ్లికొడుకు మీద వాంతి చేసుకున్న పెళ్లికూతురు.. కారణం ఏంటో తెలుసా?
ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు