పెళ్లి అనేది ప్రతి మనిషికి జీవితంలో ఒకసారే జరుగుతుంది. అందుకే.. తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటారు కొందరు. కానీ.. కొందరికి ఆ పెళ్లే చేదు జ్ఞాపకంగా మారుతుంటుంది. ఈ పెళ్లికూతురుకు కూడా అదే జరిగింది. తన పెళ్లి రోజున తనకు అన్నీ కష్టాలే ఎదురయ్యాయి.
యూఎస్‌లోని మిన్నెసోటాకు చెందిన 22 ఏళ్ల హొల్లీ కొలెండా డార్నెల్కు జాక్సన్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయింది. ఫ్లొరిడాలో వాళ్ల పెళ్లి జరుగుతోంది. క్రిస్టియన్ పద్ధతి ప్రకారం.. వరుడు.. వధువుకు రింగ్ తొడగడానికి సిద్ధమయ్యాడు.
ఇంతలోనే పెళ్లికూతురు ఒక్కసారిగా స్పృహ తప్పి వరుడి భుజాల మీద పడిపోయింది. ఆ తర్వాత తేరుకొని లేచి అతడి మీదనే వాంతి చేసుకుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు.. అని నాకు కాబోయే శ్రీవారికి ఎన్నిసార్లు చెప్పాలని ట్రై చేసినా అతడు నన్ను పట్టించుకోలేదు. జోక్ చేస్తున్నా అనుకున్నాడు.. అని తర్వాత పెళ్లి కూతురు చెప్పుకొచ్చింది.
అంతేనా.. తను ఓవైపు వాంతి చేసుకుంటుంటే.. ఇంకోవైపు తన సోదరి కొడుకు తన మీద మలవిసర్జన చేశాడట. తను వాంతి చేసుకుందని డ్రెస్ ఆరడం కోసం ఫ్యాన్‌ను పెళ్లికూతురు వైపు తిప్పబోయింది పెళ్లికూతురు సోదరి. అప్పటికే తన చేతుల్లో ఆమె కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడు అప్పుడే మలవిసర్జన చేయడంతో అదంతా పెళ్లికూతురు మీద పడిందట.
అసలు.. ఇలాంటి పెళ్లి ఎవరికైనా జరుగుతుందా? ఎవ్వరికీ ఇటువంటి పెళ్లి జరగకూడదు.. అని తన పెళ్లి తర్వాత కొలెండా తన పెళ్లి బాధలను వెల్లగక్కింది. తన పెళ్లి రోజున ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదట. ఏం తినలేదట. అందుకే తనకు కళ్లు తిరిగినట్టు అయి వాంతులు చేసుకుందట. నిజమే కదా.. ఇటువంటి పెళ్లి రోజు ఎవరికీ ఉండకూడదు. తను ఏ ముహూర్తాన పెళ్లికి రెడీ అయిందో కానీ.. తన పెళ్లిరోజే తనకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు
సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి.. ఎందుకో తెలుసా?
అచ్చుగుద్దినట్టు విమానంలా పక్షి ల్యాండింగ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో