కోవిడ్ సర్టిఫికెట్ కోసం కృత్రిమ చేయి పెట్టుకొని వ్యాక్సిన్ వేయించుకోబోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కోవిడ్ సర్టిఫికెట్ కోసం కృత్రిమ చేయి పెట్టుకొని వ్యాక్సిన్ వేయించుకోబోయాడు | ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనేది మస్ట్. ఎక్కడికెళ్లినా.. రెండు డోసులు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సిందే
ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనేది మస్ట్. ఎక్కడికెళ్లినా.. రెండు డోసులు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సిందే. లేదంటే చిక్కులు పడతారు. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ పేరుతో కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. దీంతో ప్రజలంతా చాలా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఒమిక్రాన్ పేరుతో కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీంతో ప్రజలంతా మరోసారి కరోనాతో భయపడుతున్నారు.

ఇప్పటికే అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ అమలులోకి వచ్చింది. కొన్ని దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్‌ను కూడా అందించారు. అలాగే.. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే అన్నింటికీ అనుమతి లభిస్తుంది. దీంతో ఓ వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ కోసం ఏకంగా ఫేక్ చేయిని పెట్టుకొని వ్యాక్సిన్ వేయించుకోబోయాడు. కానీ.. అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది.
50 ఏళ్ల ఇటాలియన్‌కు వ్యాక్సిన్ వేసుకోవడం ఇష్టం లేదట. కానీ.. వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం కంపల్సరీ చేయడంతో.. కృత్రిమ చేయిని పెట్టుకొని బియెల్లాలోని హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. తనకు వ్యాక్సిన్ వేయబోయిన నర్సు.. అది నిజమైన చేయి కాదని గుర్తించింది. వెంటనే అతడిని అడిగింది. అతడు.. నర్సుకు డబ్బు ఆశ చూపబోయాడు. కానీ.. తను వెంటనే తన పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. అతడు కూడా ఒక హెల్త్ వర్కరే కావడంతో.. అతడు ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోకపోవడంతో అతడిని విధులను అధికారులు సస్పెండ్ చేశారు.
ఇటలీలో ప్రభుత్వం కోవిడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకే సూపర్ గ్రీన్ పాస్‌ను అందిస్తోంది. ఆ పాస్ ఉన్నవాళ్లకే రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్‌లోకి అనుమతిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి.. ఎందుకో తెలుసా?
అచ్చుగుద్దినట్టు విమానంలా పక్షి ల్యాండింగ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఆ దేశంలో తొలి కరోనా కేసు.. ఫస్ట్ వేవ్ నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు
అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. 35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

