Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్ | మన దేశంలో టిక్‌టాక్ బ్యాన్ అయింది కానీ.. ఇతర దేశాల్లో టిక్‌టాక్ మామూలుగా హల్చల్ చేయడం లేదు. మొన్ననే కదా.. మిల్క్ ట్రే చాలెంజ్ టిక్‌టాక్‌లో
మన దేశంలో టిక్‌టాక్ బ్యాన్ అయింది కానీ.. ఇతర దేశాల్లో టిక్‌టాక్ మామూలుగా హల్చల్ చేయడం లేదు. మొన్ననే కదా.. మిల్క్ ట్రే చాలెంజ్ టిక్‌టాక్‌లో తెగ ఫేమస్ అయింది. పిరమిడ్ ఆకారంలో మిల్క్ ట్రేలను అమర్చి.. వాటిపై ఎక్కి చివరి ట్రే వరకు చేరుకొని ఫోటో, వీడియో తీసి టిక్‌టాక్‌లో షేర్ చేసి.. ఆ చాలెంజ్‌ను మరికొందరికి విసరాలి. అయితే.. పిరమిడ్ ఆకారంలో అమర్చిన ట్రేలపై ఎక్కే క్రమంలో చాలామంది కింద పడి గాయాలపాలయ్యారు. దీంతో ఆ చాలెంజ్‌ను టిక్‌టాక్ బ్యాన్ చేసింది.

తాజాగా.. అదే తరహాలో మరో చాలెంజ్ ప్రస్తుతం టిక్‌టాక్‌లో వైరల్ అవుతోంది. కెనడాలోని నార్త్ బే సిటీలో ఈ చాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. దాని పేరే డోర్ కిక్ చాలెంజ్(Door kick challenge). ఈ చాలెంజ్ ప్రకారం.. ఫేమస్ సాంగ్ డై యంగ్(Die Young) అనే పాట ప్లే అవుతున్నప్పుడు ఇంటి డోర్ ముందు నిలబడి.. డోర్‌ను కాళ్లతో తన్నాల్సి ఉంటుంది.
చిన్నపిల్లలు నాక్ అండ్ రన్ గేమ్ ఆడుతుంటారు కదా.. అటువంటిదే ఈ చాలెంజ్ కానీ.. ఈ చాలెంజ్ వల్ల చాలామంది టీనేజర్లు సమస్యల్లో చిక్కుకుంటున్నారట. ఇంటి డోర్‌ను కాళ్లతో సౌండ్ చేసే సమయంలో.. ఇంట్లోని వాళ్లు ఎవరో దొంగలు వచ్చారేమో అనుకొని పోలీసులకు ఫోన్ చేయడం.. లేదంటే ఇంటి డోర్ డ్యామేజ్ కావడం, పలు అపార్ట్‌మెంట్స్‌లో ప్రపార్టీలు డ్యామేజ్ అవడం జరిగిందట. దీంతో పోలీసులు అక్కడి టీనేజర్లందరికీ హెచ్చరికలు జారీ చేశారు.
ఆ ఆన్లైన్ చాలెంజ్ పేరుతో ఇంటి తలుపును ఎవరు తన్నినా.. డ్యామేజ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. ఆ చాలెంజ్‌ను కూడా టీనేజర్లు రాత్రి పూట చేస్తుండటంతో.. ఖచ్చితంగా అది సమస్యల్లో పడేస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ఆ చాలెంజ్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. అయినా కూడా కొన్ని చోట్లు ఆ చాలెంజ్‌ను టీనేజర్లు పూర్తి చేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ దేశంలో తొలి కరోనా కేసు.. ఫస్ట్ వేవ్ నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు
అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. 35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు
1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.. ఎందుకో తెలుసా?
King Cobra: బెదిరిపోయి వంటింట్లో జొరబడ్డ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Hyderabad | లాక్డౌన్ టైమ్‌లో ప్రాణాలకు తెగించి సేవలందించారు.. నోబెల్‌కు నామినేట్ అయ్యారు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

