King Cobra: బెదిరిపోయి వంటింట్లో జొరబడ్డ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
King Cobra: సాధారణంగా పామును చూడగానే చాలామంది ఆమడ దూరం పరుగుతీస్తారు. భయంతో వణికిపోతారు. కానీ పాములు పట్టడంలో సుశిక్షితులైన వాళ్లు వాటికి ఏ మాత్రం భయపడరు. పాము ఏ సందులో దాగివున్నా ధైర్యంగా

న్యూఢిల్లీ: సాధారణంగా పామును చూడగానే చాలామంది ఆమడ దూరం పరుగుతీస్తారు. భయంతో వణికిపోతారు. కానీ పాములు పట్టడంలో సుశిక్షితులైన వాళ్లు వాటికి ఏ మాత్రం భయపడరు. పాము ఏ సందులో దాగివున్నా ధైర్యంగా బయటికి తీసుకొస్తారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ కింగ్ కోబ్రా ( King Cobra ) దారితప్పి ఇండ్ల మధ్యకు వచ్చింది. జనాలు భయంతో ఉరుకులు, పరుగులు పెట్టడంతో బెదిరిపోయి ఓ ఇంట్లో చొరబడింది.
ఆ ఇంటి యజమానికి ఫిర్యాదు మేరకు స్నేక్ సొసైటీ వాళ్లు అక్కడి వచ్చారు. పాము కోసం వెతుకగా అది వంటింట్లో గ్యాస్ సిలిండర్ వెనుక నక్కి కనిపించింది. దాన్ని బంధించేందుకు స్నేక్ టీమ్ వాళ్లు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. వంటిల్లు అంతటా పరుగులు పెట్టించింది. ఎట్టకేలకు వాళ్లు దాన్ని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. పాముకు ఊపిరి ఆడేందుకు ఆ డబ్బాకు రంధ్రాలు చేశారు. ఆనంతరం ఆ కోబ్రాను తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.
ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి అప్పట్లోనే యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను మొత్తం 30 మిలియన్ల మంది (3 కోట్ల మంది) వీక్షించారు. మరింకెందుకు ఆలస్యం ఈ కింగ్ కోబ్రా హల్చల్పై మీరు కూడా ఓ లుక్కేయండి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Bhadrak
- King Cobra
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

