సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి.. ఎందుకో తెలుసా?
సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి | ఓ బల్లి.. దాదాపు 7000 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించింది. రకరకాల వాతావరణాలను తట్టుకొని అది అన్ని కిలోమీటర్లు ప్రయాణించి
ఓ బల్లి.. దాదాపు 7000 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించింది. రకరకాల వాతావరణాలను తట్టుకొని అది అన్ని కిలోమీటర్లు ప్రయాణించి బతికి బట్టకట్టడం అనేది నిజంగా మిరాకిల్. యూఎస్‌లోని ఫ్లొరిడా నుంచి ఇంగ్లండ్ వరకు 7250 కిలోమీటర్లు ప్రయాణించింది ఆ బల్లి.

అది కూడా ఓ సూట్‌కేసులో దాక్కొని. యూఎస్ నుంచి ఇంగ్లండ్‌కు సూట్‌కేసులో దాక్కొని మరీ రావాల్సిన అవసరం దానికి ఏంటి అంటారా? అదేం కావాలని చేయలేదు. రచెల్ బాండ్ అనే ఓ టూరిస్టు.. ఇంగ్లండ్‌లోని వైట్లీ బే నుంచి యూఎస్‌కు వెళ్లింది. ఫ్లొరిడాలోని ఒర్లాండోకు వెళ్లింది.
అక్కడి నుంచి తన దేశానికి తిరిగి వచ్చేసింది. ఇంటికి వచ్చాక తన సూట్‌కేస్ ఓపెన్ చేసి చూస్తే అందులో నుంచి గ్రీన్ కలర్లో ఉన్న బల్లి బయటికి వచ్చింది. దాన్ని చూసి రచెల్ షాక్ అయింది. తన తల్లి కూడా ఆ బల్లిని చూసింది. అది అనోల్ జాతికి చెందిన బల్లి.
ఆ బల్లి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుండటంతో రచెల్తో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. వెంటనే రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయారు.
ఇంగ్లండ్‌లో అటువంటి జాతికి చెందిన బల్లులు అస్సలు ఉండవు. అవి వేడి వాతావరణంలోనే ఎక్కువగా జీవిస్తాయి. నిజానికి అనోల్ జాతికి చెందిన ఆ బల్లులు కరేబియన్ ఐలాండ్‌కు చెందినవి. కాకపోతే ఫ్లొరిడా, టెక్సాస్, నార్త్ కరోలినాలోనూ అవి అక్కడక్కడా కనిపిస్తుంటాయి.
అయితే.. ఆ బల్లిని తీసుకొచ్చి చలి ప్రాంతంలో పడేయడంతో అది సర్వైవ్ అవుతుందో లేదో అని రెస్క్యూ టీమ్ టెన్షన్ పడ్డారట. దాన్ని వైల్డ్ లైఫ్ పార్క్‌లో కానీ.. జూలో కానీ వదిలేయాలని అనుకున్నారు. కానీ.. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులను అది తట్టుకుందని.. అది చాలా లక్కీ అంటూ ఆర్ఎస్పీసీఏ చారిటీ ఇన్స్పెక్టర్ లూసీ గ్రీన్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అచ్చుగుద్దినట్టు విమానంలా పక్షి ల్యాండింగ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఆ దేశంలో తొలి కరోనా కేసు.. ఫస్ట్ వేవ్ నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు
అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. 35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు
1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.. ఎందుకో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

