ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు
ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు | ఇంట్లోకి ఏవైనా కీటకాలు, పాములు వస్తేం ఏం చేస్తాం. వాటిని ఇంట్లో నుంచి తరుముతాం. మరీ.. డేంజరస్ పాములు అయితే
ఇంట్లోకి ఏవైనా కీటకాలు, పాములు వస్తేం ఏం చేస్తాం. వాటిని ఇంట్లో నుంచి తరుముతాం. మరీ.. డేంజరస్ పాములు అయితే.. రెస్క్యూ టీమ్‌ను పిలుస్తాం. వాళ్లే వాటి భరతం పడతారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఇంట్లోకి పాములు దూరాయని.. తనే సొంత నిర్ణయం తీసేసుకున్నాడు. దాని వల్ల చివరకు తన ఇల్లే తగులబడిపోయింది. ఈ ఘటన యూఎస్‌లోని మేరీలాండ్‌లోని మాంట్గోమెరీ కంట్రీలో చోటు చేసుకుంది.

ఓ ఇంటి ఓనర్ తన ఇంట్లో దూరిన పాములను బయటికి తరిమేందుకు.. కొన్ని నిప్పులతో పొగ చేసి వాటిని పాములపై ప్రయత్నించాడు. ఇంట్లో పొగ పెట్టాడు. ఆ పొగకు ఊపిరి ఆడక అవి బయటికి వెళ్లిపోతాయని అనుకున్నాడు. కానీ.. ఇంతలో జరగరాని ఘోరం జరిగిపోయింది. ఓ నిప్పు రవ్వ వెళ్లి మండే వస్తువుపై పడింది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇంటిని వ్యాపించి.. ఇల్లు మొత్తాన్ని కాల్చి బూడిద చేశాయి.
వెంటనే అక్కడికి అగ్ని మాపక సిబ్బంది చేరుకున్నప్పటికీ అప్పటికే ఇల్లు మొత్తం దగ్ధం అయిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అలాగే.. ఆ పాముల జాడ కూడా తెలియలేదు. ఈ ఘటన వల్ల 7.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఇంటి ఓనర్ తెలిపాడు. ఆ ఇల్లు కాలిపోతున్న దృశ్యాలను ఫైర్ ఫైటర్స్ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములను తరిమేందుకు ఇల్లునే కాల్చి బూడిద చేసుకున్నావు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ICYMI – Update Big Woods Rd, house fire 11/23; CAUSE, accidental, homeowner using smoke to manage snake infestation, it is believed heat source (coals) too close to combustibles; AREA of ORIGIN, basement, walls/floor; DAMAGE, >$1M; no human injures; status of snakes undetermined https://t.co/65OVYAzj4G pic.twitter.com/xSFYi4ElmT
— Pete Piringer (@mcfrsPIO) December 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి.. ఎందుకో తెలుసా?
అచ్చుగుద్దినట్టు విమానంలా పక్షి ల్యాండింగ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఆ దేశంలో తొలి కరోనా కేసు.. ఫస్ట్ వేవ్ నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

