చోలె భటురే తినాలంటే నార్త్ ఇండియా చెక్కేయాల్సిందే. ఆ టేస్ట్ ఇక ఎక్కడ దొరకదు. సౌత్ ఇండియాలోనూ చోలె భటురే దొరికినా.. దాని అసలైన టేస్ట్ కావాలంటే మాత్రం నార్తే. ఒక్కసారి చోలె భటురే టేస్ట్ చేస్తే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. కాస్త స్పైసీగా ఉండే చోలె నాలికకు టచ్ అయితే చాలు.. అబ్బ.. అంటూ లాగించేయడమే.
అయితే.. ఒక్క ప్లేట్ చోలె బటురే కాస్ట్ ఎంతుంటుంది చెప్పండి. మా.. అంటే 50 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది అంతే కదా. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ప్లేట్ చోలె భటురేను వెయ్యి రూపాయలు పెట్టి తిన్నాడు. టేస్ట్ మాత్రం దరిద్రంగా ఉందట. అసలు ఇది చోలె భటురేనా కాదా.. అనే డౌట్ వచ్చిందట ఆ వ్యక్తికి.
ఇంతకీ ఎక్కడ దానికి అంత కాస్ట్ అంటారా? మన దేశంలో కాదు లెండి. స్వీడన్లో. ఇండియాకు చెందిన ఓ వ్యక్తి స్వీడన్లో ఉంటున్నాడు. ఒకరోజు అతడికి చోలె భటురే తినాలనిపించింది. దీంతో స్వీడన్లో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ చోలె భటురేను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక చూసి షాక్ అయ్యాడు. అది చూడటానికి చోలె భటురేలాగానే లేదు. సరే.. ఏదో ఒకటి ఇచ్చారు కదా అని టేస్ట్ చేశాడు. టేస్ట్ దరిద్రంగా ఉంది. అయిష్టంగానే దాన్ని తిని.. బిల్లు ఎంతైంది అనగా.. వాళ్లు వెయ్యి రూపాయలు అని చెప్పారు. అంటే వాళ్ల కరెన్సీలో 160 స్వెడిష్ క్రోన్స్ అన్నమాట.
చోలె భటురే అంటూ ఆ స్పైసీనెస్ వేరు. చోలెలో వేసే మసాలాతోనే ఆ టేస్ట్ వస్తుంది. కానీ.. ఈ చోలెలో మాత్రం ఉప్పు, పెప్పర్ తప్ప ఇంకేం లేదు. అయినా.. చోలెలో ఎవరైనా దానిమ్మ గింజలు వేస్తారా. మరోవైపు భటురే చుస్తే మందంగా ఉంది.. తియ్యగా ఉంది.. అంటూ తన బాధను ఆ ఎన్ఆర్ఐ.. రెడిట్‌లో వెళ్లగక్కాడు. ఇంటి ఫుడ్డును చాలా మిస్ అవుతున్నా… అంటూ రెడిట్‌లో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు తమదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
అది చోలె భటురేలా లేదు.. కచోరిలా ఉంది. ఆ వెయ్యి రూపాయలు పెడితే.. ఇక్కడ మన దగ్గర ఫ్యామిలీ మొత్తం చోలె భటురేను తినొచ్చు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెళ్లి జరుగుతుండగా.. పెళ్లికొడుకు మీద వాంతి చేసుకున్న పెళ్లికూతురు.. కారణం ఏంటో తెలుసా?
ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు
సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి.. ఎందుకో తెలుసా?