వాఘా బార్డర్ వద్ద పుట్టాడని తన కొడుకుకు ‘బార్డర్’ అని పేరు పెట్టిన పాకిస్థానీ మహిళ
వాఘా బార్డర్ వద్ద పుట్టాడని తన కొడుకుకు 'బార్డర్' అని పేరు పెట్టిన పాకిస్థానీ మహిళ | ఓ పాకిస్థానీ మహిళ.. తన కొడుకుకు బార్డర్ అనే కొత్త పేరు పెట్టింది. ఇండియా- పాకిస్థాన్ బార్డర్ వాఘా- అట్టారి వద్ద ఆ మహిళ పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. దీంతో తన బిడ్డకు బార్డర్ అనే పేరు పెట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.
ఓ పాకిస్థానీ మహిళ.. తన కొడుకుకు బార్డర్ అనే కొత్త పేరు పెట్టింది. ఇండియా- పాకిస్థాన్ బార్డర్ వాఘా- అట్టారి వద్ద ఆ మహిళ పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. దీంతో తన బిడ్డకు బార్డర్ అనే పేరు పెట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.

డిసెంబర్ 2, 2021న ఆ మహిళకు డెలివరీ అయింది. ఆ మహిళ పేరు నింబు బాయి. తన భర్త పేరు బలమ్ రామ్. పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన వాళ్లు గత 71 రోజుల నుంచి వాఘా బార్డర్ వద్దే పడికాపులు కాస్తున్నారు. వాళ్లతో పాటు మరికొంతమంది పాకిస్థానీయులు కూడా అదే బార్డర్ వద్ద పర్మిషన్ కోసం వేచి చూస్తున్నారు.
లాక్డౌన్ కంటే ముందు.. బలమ్ రామ్ తన భార్యతో కలిసి ఇండియాకు వచ్చాడు. ఇండియాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించడంతో పాటు.. తమ బంధువులను కలుసుకోవడం కోసం వచ్చారు. కానీ.. ఇంతలో లాక్ డౌన్ విధించడంతో ఇండియాలోనే చిక్కుకుపోయారు. వాళ్లు తిరిగి తమ దేశానికి వెళ్లడానికి అట్టారి- వాఘా బార్డర్ దగ్గరికి వచ్చినప్పటికీ.. సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా వాళ్లను ఇండియా బార్డర్ దాటనీయలేదు అధికారులు.
దీంతో అక్కడే టెంట్ వేసుకొని 71 రోజుల నుంచి ఉంటున్నారు. డిసెంబర్ 2న నింబు బాయికి పురిటి నొప్పులు రావడంతో పక్కనే ఉన్న గ్రామాల నుంచి కొందరు మహిళలు వచ్చి తనకు ప్రసవం చేశారు. వెంటనే మెడికల్ ఫెసిలిటీని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. బార్డర్ వద్ద తన కొడుకు పుట్టాడు కాబట్టి.. తన కొడుకుకు బార్డర్ అనే పేరు పెడుతున్నట్టు ఆ మహిళ వెల్లడించింది.
ప్రస్తుతం ఇండియాలో చిక్కుకుపోయిన 98 పాకిస్థానీయులలో 47 మంది పిల్లలు ఉన్నారు. వాళ్లంతా ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లే. ఆ పిల్లలకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవపత్రాలు లేకపోవడంతో వాళ్లు బార్డర్ దగ్గరే ఆగిపోయారు.
నింబు బాయి లాగే.. పాకిస్థాన్‌కు చెందిన మరో మహిళ లగ్యా రామ్.. 2020లో ఇండియాకు వచ్చింది. జోధ్‌పూర్‌లో తనకు కొడుకు పుట్టడంతో అతడికి భారత్ అనే పేరు పెట్టింది. జోధ్‌పూర్‌లో ఉన్న తన సోదరుడిని కలుసుకోవడానికి వచ్చిన లగ్య.. తిరిగి పాకిస్థాన్ వెళ్లలేక బార్డర్ వద్దే పడిగాపులు కాస్తోంది.
వీళ్లంతా అట్టారి ఇంటర్నేషనల్ బార్డర్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో టెంట్లు వేసుకొని ఉంటున్నారు. వీళ్లకు అక్కడి స్థానికులు రోజూ మూడు పూటలా ఆహారం అందించి.. ఇతర సౌకర్యాలు అన్నీ చూసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
స్కై సర్ఫింగ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 13500 ఫీట్ల ఎత్తు నుంచి దూకి.. వైరల్ వీడియో
సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్లి ఈ మహిళ ఏం చేసిందో తెలుసా?
Chole Bhature : అక్కడ ప్లేట్ ‘చోలె భటురే’ ధర రూ.1000… టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా?
Fire Panipuri: ఫైర్ పానీపూరీ.. అక్కడ ఇదే స్పెషల్.. ఎలా తినాలో తెలుసా?
పెళ్లి జరుగుతుండగా.. పెళ్లికొడుకు మీద వాంతి చేసుకున్న పెళ్లికూతురు.. కారణం ఏంటో తెలుసా?
ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

