ఆహారం విషయంలో డిమాండ్, సప్లయికి ఎప్పుడూ చాలా తేడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. డిమాండ్ 100 శాతం ఉంటే.. 50 శాతం వరకే ఫుడ్ దొరుకుతుంది. అందుకే కదా.. ఆకలి కేకలు, ధరలు భగ్గుమనడం. డిమాండ్ అమాతం పెరగ్గానే.. ఆహార పదార్థాల రేట్లను విపరీతంగా పెంచేస్తారు.
ఇదంతా ఇలా ఉంటే.. మరోవైపు పెళ్లిళ్లు, ఫంక్షన్ల పేరుతో చాలామంది చాలాఫుడ్ను వేస్ట్ చేస్తుంటారు. సగానికంటే ఎక్కువ ఫుడ్‌ను వేస్ట్ చేస్తుంటారు. కొందరు ఏదైనా అనాథాశ్రమానికి పంపిస్తే.. మరికొందరు ఎవరికొచ్చిన బాధ అని అనుకొని.. ఫంక్షన్ హాల్స్‌లోనే పడేసి వెళ్తుంటారు. కానీ.. ఈ మహిళ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా.. అందరికంటే భిన్నంగా ఆలోచించింది.
తన సోదరుడి వివాహంలో మిగిలిపోయిన ఫుడ్‌ను అలాగే వదిలేయలేదు. తనకెందుకులే అని చూస్తూ ఊరుకోలేదు. వెంటనే సగం కంటే ఎక్కువ మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకెళ్లి పేద ప్రజలకు పంచింది. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నదాత అయింది. వాళ్ల ఆకలిని తీర్చింది.
ఈ ఘటన వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంది. తన సోదరుడి పెళ్లి అయిపోగానే.. మిగిలిన ఆహారాన్ని తీసుకొని పాపియా కార్ అనే మహిళ రానాఘాట్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడ అర్ధరాత్రి వరకు కూర్చొని అందరికీ వడ్డించింది. వచ్చిన వాళ్లకు వచ్చినట్టు పేపర్ ప్లేట్స్‌లో పెట్టి ఫుడ్‌ను అందించింది.
ఈ ఘటనను గమనించిన ఓ ఫోటోగ్రాఫర్.. ఆమె ఫుడ్ సర్వ్ చేస్తుండగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు వెస్ట్ బెంగాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. బెంగాళీలు ఆ ఫోటోలను చూసి గర్వపడుతున్నారు. పాపియా కార్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తను గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chole Bhature : అక్కడ ప్లేట్ ‘చోలె భటురే’ ధర రూ.1000… టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా?
Fire Panipuri: ఫైర్ పానీపూరీ.. అక్కడ ఇదే స్పెషల్.. ఎలా తినాలో తెలుసా?
పెళ్లి జరుగుతుండగా.. పెళ్లికొడుకు మీద వాంతి చేసుకున్న పెళ్లికూతురు.. కారణం ఏంటో తెలుసా?
ఇంట్లోకి పాములు దూరాయని.. ఇల్లునే తగులబెట్టేశాడు