Thgungathurthy : తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు ముదురుతోంది. ఈసారి ఏకంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది పరిస్ధితి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kirankumar Reddy), ఎమ్మెల్యే మందుల సామేల్ (Mandual Samuel) మధ్య వివాదం మరింత తీవ్రమైంది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా ఎంపీ చామల అనుచరుడు పర్రపాటి యుగంధర్‌పై మందుల సామేల్ అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. యుగంధర్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు మందుల సామేల్ అనుచరులను చెదరగొట్టారు.
తుంగతుర్తి వివాదంపై ఇటీవలే ఇరువర్గాల ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య నెలకొన్న విభేదాలను చక్కబెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. జగ్గారెడ్డి స్వయంగా ఇరువురితో, ఇతర నాయకులతో మాట్లాడి సయోధ్యకు యత్నించారు. అయినా సరే మందుల సామేల్ అవేవీ లెక్కచేయలేదు. కోమటిరెడ్డి సోదరులపై, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడిపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు.
‘ఈ నియోజకవర్గం నాది, ఎవరూ అడుగుపెట్టేందుకు అధికారం లేదు. ఎస్సీ నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటీ?’ అని కోమటిరెడ్డి బ్రదర్స్, ఇతరులకు సామేల్ గట్టిగానే హెచ్చరికలు చేశారు. వర్గపోరు కొనసాగుతుండగానే.. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడిపై సామేల్ అనుచరులు దాడి చేయడం కాంగ్రెస్‌లో ‘ఎవరికి వారే లీడర్’ అనే పద్ధతికి అద్దం పడుతోంది.
చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడిపై మందుల సామేల్ అనుచరుల హత్యాయత్నం
ముదురుతున్న మందుల సామేల్ vs చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వివాదం
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడు పర్రపాటి యుగంధర్‌పై హత్యాయత్నానికి… https://t.co/1mOuHEhYod pic.twitter.com/sRrJ4mSUW6
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2026