Mirabai Chanu : కామన్వెల్త్ క్రీడల్లో వరసగా మూడోసారి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను (Mirabai Chanu) యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది. 48 కిలోల విభాగంలో సత్తా చాటిన మీరాబాయి.. గ్లాస్గోలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. పోడియం మీద పతకం అందుకుంటున్న సమయంలో జాతీయ గీతం వింటున్నప్పుడు కలిగే అనుభూతికి మరోది సాటిరాదంటోంది వెయిట్‌లిఫ్టర్. హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్స్‌తో తనకు తానే సాటి అని నిరూపించుకున్న మీరాబాయి ఈసారి గెలిచిన పతకాన్ని కుటుంబానికి అంకితమిచ్చింది.
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి తొలి గోల్డ్‌మెడల్ అందించింది మీరాబాయి చాను. 48 కిలోల విభాగంలో ప్రత్యర్థులను తోసిరాజని అగ్రస్థానం నిలబెట్టుకున్న చాను.. బరువును అదుపులో ఉంచుకునేందుకు కడుపు మాడ్చుకుందట. ఈ విషయాన్ని గోల్డ్ ఖరారయ్యాక వెల్లడించిందామె.
“I didn’t eat for the last three days. Maintaining my weight was extremely difficult. I dedicate this gold medal to my family,” a teary-eyed Mirabai Chanu said after winning the gold medal. pic.twitter.com/ayVoRTecFY
— IANS (@ians_india) July 26, 2026
‘మూడు రోజులుగా ఏమీ తినలేదు. ఎందుకంటే నా బరువును అదుపులో ఉంచుకోవడం చాలా కష్టం. అందుకే అలా ఖాళీ కడుపుతోనే ఉన్నా. ఈ స్వర్ణాన్ని నా కుటుంబానికి అంకితమిస్తున్నా. వరసగా మూడోసారి కామన్వెల్త్ పసిడి గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. భారత దేశం కోసం, భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య కోసం గోల్డ్ మెడల్ సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాకిది చాలా పెద్ద విషయం’ అని చాను భావోద్వేగంతో చెప్పింది.
All hail the Queen! 🙇
Mirabai Chanu completes a historic Commonwealth Games hat-trick, sealing it with a Games Record lift of 190kg.
Watch the Commonwealth Games Glasgow 2026, LIVE NOW exclusively on Sony Sports Network TV channels and Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/dtsSbikbKa
— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026
కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018, 2022లో పసిడి పతకం కొల్లగొట్టిన మీరాబాయి గ్లాస్గోలోనూ పట్టువదల్లేదు. ఈ ఎడిషన్‌లోనూ దేశానికి తొలి స్వర్ణం అందించింది. 82 కిలోలతో కామన్వెల్త్లో రికార్డు నెలకొల్పిన మీరాబాయి..క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తొలి ప్రయత్నంలో విఫలమైంది. రెండోసారి తడబడకుండా 82 కిలోలు, మూడో ప్రయత్నంలో 85 కిలోలు ఎత్తి సరికొత్త రికార్డు సాధించింది.

అనంతరం 105 కిలోలను సైతం అవలీలగా ఎత్తిన మీరాబాయి పసిడి పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. తద్వారా భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మీరా కంటే ముందు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే చనంబమ్ రిషికాంత సింగ్ (Chanambam Rishikanta Singh) రజతంతో మెరిశాడు. పురుషుల 60 కిలోల విభాగంలో సత్తా చాటిన అతడు రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు.