బీరు టిన్‌లో తల దూర్చిన నాగుపాము.. బయటికి రాలేక తిప్పలు.. వైరల్ వీడియో
బీరు టిన్‌లో తల దూర్చిన నాగుపాము.. బయటికి రాలేక తిప్పలు | ఓ నాగుపాము ఏకంగా తాగి పడేసిన బీరు టిన్‌లో తల దూర్చింది. ఆ తర్వాత తనకు దానిలో నుంచి బయటికి రాలేకపోయింది.
ఓ నాగుపాము ఏకంగా తాగి పడేసిన బీరు టిన్‌లో తల దూర్చింది. ఆ తర్వాత తనకు దానిలో నుంచి బయటికి రాలేకపోయింది. పాము తల అందులో ఇరుక్కుపోయింది. అందులో నుంచి బయటపడేందుకు పాము ఎంతో ప్రయత్నించినప్పటికీ.. దాని వల్ల కాలేదు. ఈ ఘటన ఒడిశాలోని పూరీ జిల్లాలో చోటు చేసుకుంది.

మాధిపూర్ గ్రామస్తులకు బీరు టిన్‌లో తల ఇరుక్కుపోయిన ఈ పాము ఓ చెట్టు వద్ద కనిపించింది. దీంతో వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది దాన్ని పట్టుకొని బీరు టిన్ నుంచి పాము తలను తీసేందుకు తెగ ప్రయత్నించారు.
టిన్ను మొత్తం కట్టర్‌తో కట్ చేసి పాము ఎవరినీ కాటేయకుండా.. దాని తలను ఒక ప్లాస్టిక్ పైపులోకి దూర్చి.. ఆ తర్వాత టిన్ మొత్తాన్ని కట్ చేశారు. ఆ తర్వాత ఆ పాముకు విముక్తి కలిగింది. వెంటనే దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు.. రెస్క్యూ టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. పాము కోసం చాలా కష్టపడ్డారంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
లక్కంటే ఆ పిల్లాడిదే.. ఒక్క క్షణం ఆలస్యమైనా పిల్లాడి ప్రాణాలు పోయేవి: వైరల్ వీడియో
బాలీవుడ్ సాంగ్‌కు ఎయిర్‌హోస్టెస్ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
వాఘా బార్డర్ వద్ద పుట్టాడని తన కొడుకుకు ‘బార్డర్’ అని పేరు పెట్టిన పాకిస్థానీ మహిళ
స్కై సర్ఫింగ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 13500 ఫీట్ల ఎత్తు నుంచి దూకి.. వైరల్ వీడియో
సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్లి ఈ మహిళ ఏం చేసిందో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- beer tin
- Cobra
- trending
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

