గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, ఇతర వ్యాపారస్థులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో ప్రభుత్వం కూడా వ్యాపారులకు అండగా నిలవడం కొసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. యూఎస్ ప్రభుత్వం కూడా అక్కడి బిజినెస్‌మెన్‌కు అండగా ఉండేందుకు.. వాళ్ల బిజినెస్ నడవడం కోసం కోవిడ్ రిలీఫ్ పేరుతో లోన్స్ ఇస్తోంది.
అయితే.. దాన్ని చాన్స్‌గా తీసుకున్న ఓ వ్యక్తి.. తన బిజినెస్ కోసం ఫండ్స్ కావాలని కోవిడ్ రిలీఫ్ కింద 12 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో కాస్ట్లీ కారు లంబోర్ఘిని కొన్నాడు. కాస్ట్లీ రొలెక్స్ వాచ్ కొన్నాడు.
తర్వాత అధికారులకు ఈ విషయం తెలియడంతో అతడికి 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. తప్పుడు సమాచారం ఇచ్చి.. లోన్ తీసుకొని బిజినెస్ కోసం వాడుకోకుండా.. జల్సాలు చేసినందుకు కోర్టు అతడికి 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
తనకు ప్రైస్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఉందని.. 50 మంది ఉద్యోగులు ఉన్నారని.. నెలకు జీతాలకే 3 కోట్లు పే చేయాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ద్వారా కోవిడ్ రిలీఫ్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు లీ ప్రైస్.
చాలా బ్యాంకులు అతడి లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించినా.. కొన్ని బ్యాంకులు మాత్రం అతడికి లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ముందు అతడికి 7 కోట్ల రూపాయలను ఓ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసింది. ఆ డబ్బులతో ఒక రొలెక్స్ వాచ్, లంబోర్ఘిని ఉరుస్ లగ్జరీ కారు, ఫోర్డ్ ఎఫ్ 350 కారును కొనుగోలు చేశాడు. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
అయితే.. ఆ బ్యాంక్ బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. అసలు.. అతడు సమర్పించిన డాక్యుమెంట్స్‌లో ఉన్న కంపెనీ లేదని.. అంతా ఫేక్ అని తెలుసుకున్న అధికారులు వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడి నుంచి 5 కోట్ల రూపాయలను రికవరీ చేశారు.
యూఎస్‌లో లీప్రైస్ లాంటి వాళ్లు చాలామందే ఉన్నారట. మరో 120 మంది కూడా ఇలాగే పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ద్వారా ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి లోన్ పొందారు. వాళ్లపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
డియర్ ఆనంద్ మహీంద్రా.. మీ ఎలక్ట్రిక్ ఆటో బాగుంది.. కానీ
బీరు టిన్‌లో తల దూర్చిన నాగుపాము.. బయటికి రాలేక తిప్పలు.. వైరల్ వీడియో
లక్కంటే ఆ పిల్లాడిదే.. ఒక్క క్షణం ఆలస్యమైనా పిల్లాడి ప్రాణాలు పోయేవి: వైరల్ వీడియో
బాలీవుడ్ సాంగ్‌కు ఎయిర్‌హోస్టెస్ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
వాఘా బార్డర్ వద్ద పుట్టాడని తన కొడుకుకు ‘బార్డర్’ అని పేరు పెట్టిన పాకిస్థానీ మహిళ