Viral Video :పెళ్లిమండపంలో పెళ్లికూతురు లవర్ రచ్చ.. పెళ్లికొడుకు ముందే వధువు నుదుటి మీద ఏం చేశాడంటే?
పెళ్లికొడుకు ముందే వధువు నుదుటి మీద ఏం చేశాడంటే? | ఓవైపు పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లికొడుకు.. పెళ్లికూతురు మెడలో తాళి కట్టేందుకు సిద్ధపడతాడు. ఇంతలో పెళ్లికూతురు లవర్
ఓవైపు పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లికొడుకు.. పెళ్లికూతురు మెడలో తాళి కట్టేందుకు సిద్ధపడతాడు. ఇంతలో పెళ్లికూతురు లవర్.. పెండి మండపానికి వచ్చి ఆపండి.. అని గట్టిగా అరుస్తాడు. దీంతో పెళ్లికూతరు, పెళ్లికొడుకు, పూజారి, పెళ్లికి వచ్చిన బంధువులతో సహా అందరూ ఒక్కసారిగా తల తిప్పి చూస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. ఇదంతా ప్రతి సినిమాలో జరిగే కామన్ స్టోరీనే కదా.

అలాంటి సీనే నిజంగా జరిగితే.. హవ్వా.. సినిమాల్లో జరిగేవి నిజంగానే జరుగుతున్నాయా.. అని షాక్ అవుతారు కదా. అవును.. నిజంగానే యూపీలోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది ఆ ఘటన.
పెళ్లి జరుగుతోంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నిలుచున్నారు. పెళ్లికొడుకు.. పెళ్లికూతురు మెడలో దండ వేసేందుకు రెడీగా ఉన్నాడు.
ఇంతలో ముసుగు వేసుకొని పెళ్లికూతురు లవర్ పెళ్లిమండపం మీదికి వచ్చి.. తనతో పాటు తెచ్చుకున్న కుంకుమను పెళ్లికూతురు నుదుటి మీద పెడతాడు. ఒక్కసారిగా తన దగ్గర ఉన్న కుంకుమను మొత్తం తన మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు.
దీంతో అసలు ఏం జరుగుతోందో అర్థం కాదు ఎవ్వరికీ. చివరకు పెళ్లికొడుకు కూడా అలాగే చూస్తూ నిలబడిపోతాడు. ఆ వ్యక్తి చేస్తున్న చేష్టలు చూసిన కొందరు వ్యక్తులు వెంటనే అతడిని లాగి కింద పడేస్తారు. ఆ తర్వాత పెద్ద గొడవే జరుగుతుంది.
అసలు విషయం ఏంటి అని ఆరా తీస్తే.. అతడు.. పెళ్లికూతురు లవర్ అని.. కొన్ని నెలల కింద పని మీద వేరే ఊరు వెళ్లాడని.. ఇంతలో ఆ యువతికి పెళ్లి ఫిక్స్ చేశారని తెలిసింది. దీంతో కోపంతో పెళ్లిమండపానికి వచ్చి.. రచ్చ రచ్చ చేశాడు.
అయినప్పటికీ.. పెళ్లి కూతురు తండ్రి అతడికి తన కూతురును ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోకపోవడంతో అతడిని సముదాయించి పంపించేశారు. దీంతో ఆ పెళ్లికూతురు.. పెళ్లికొడుకునే చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కోవిడ్ రిలీఫ్ లోన్ తీసుకొని లంబోర్ఘిని కారు, రొలెక్స్ వాచ్ కొన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
డియర్ ఆనంద్ మహీంద్రా.. మీ ఎలక్ట్రిక్ ఆటో బాగుంది.. కానీ
బీరు టిన్‌లో తల దూర్చిన నాగుపాము.. బయటికి రాలేక తిప్పలు.. వైరల్ వీడియో
లక్కంటే ఆ పిల్లాడిదే.. ఒక్క క్షణం ఆలస్యమైనా పిల్లాడి ప్రాణాలు పోయేవి: వైరల్ వీడియో
బాలీవుడ్ సాంగ్‌కు ఎయిర్‌హోస్టెస్ స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

