Omicron variant | ఊబకాయులకు అలర్ట్.. కరోనా కొత్త వేరియంట్ సోకే అవకాశం వీరిలోనే ఎక్కువ
Obese people | కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆరోగ్య నిపుణులు మరో కొత్త వేవ్ రావచ్చునని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కొవిడ్ సోకిన వారి సంఖ్య త్వరలోనే మళ్లీ భారీ స్థాయికి చేరవచ్చునని

Omicron variant కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆరోగ్య నిపుణులు మరో కొత్త వేవ్ రావచ్చునని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కొవిడ్ సోకిన వారి సంఖ్య త్వరలోనే మళ్లీ భారీ స్థాయికి చేరవచ్చునని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రీసెర్చ్ సంస్థలు ఒక సర్వేని నిర్వహించాయి. దీని ప్రకారం సామాన్య బరువు గల మనుషుల కంటే ఊబకాయులకు రెండు రెట్లు అధిక ముప్పు పొంచి ఉందని తేలింది.
దానికి కారణం.. కరోనా సోకిన వారి అధికంగా ఐసీయూలో చేరిన వారు ఊబకాయులే. ఊబకాయులలో బిఎంఐ ఎక్కవగా ఉండడం వల్ల వారిలో ఊపిరి పీల్చుకునే సమస్యలు తలెత్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇంతకుముందు ఊబకాయులలో కరోనా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
ఈ సర్వేలో భాగంగా పిల్లలపై కూడా ఒమిక్రాన్ ప్రభావం గురించి అధ్యయనం చేశారు. ఈ క్రమంలో కెనడా, ఇరాన్, కోస్టారికా దేశాలలోని 400 పిల్లలపై ఈ సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల ప్రకారం ఊబకాయులైన పిల్లలు కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ సర్వే ఫలితాలు PLOS ONE అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచమంతా అధ్యయనాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిపై ఒమిక్రాన్ ఎలా ప్రభావం చూపుతుందని త్వరలోనే తెలుస్తందని నిపుణులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Omicron | ఒమిక్రాన్ వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
Omicron | కొత్తరకం ‘ఒమిక్రాన్’ వేరియంట్.. ఎక్కడ బయటపడిందంటే?
డెల్టా కన్నా ఒమిక్రాన్ మరీ ప్రమాదకరం కాదు: ఆంథోనీ ఫౌసీ
తల్లిదండ్రులు వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు సేఫ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

