డెల్టా కన్నా ఒమిక్రాన్ మరీ ప్రమాదకరం కాదు: ఆంథోనీ ఫౌసీ

వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీలక అంశాన్ని వెల్లడించారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ విధ్వంసకరమైంది ఏమీకాదన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమే అని, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందని, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్న దానిపై ల్యాబ్‌లో పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు మరికొన్ని రోజుల్లో వస్తాయని ఫౌసీ చెప్పారు. ఇక ఒమిక్రాన్‌తో కలిగే వ్యాధి తీవ్రత గురించి మాట్లాడుతూ.. ఇది డెల్టా కన్నా ప్రమాదకరమైంది ఏమీ కాదననారు. దక్షిణాఫ్రికా డేటాను పరిశీలిస్తే, అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, కానీ హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య డెల్టా కన్నా తక్కువగా ఉన్నట్లు ఆంథోనీ చెప్పారు. అయితే దక్షిణాఫ్రికా పరిణామాలను పూర్తిగా అంచనా వేసేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. దాని తీవ్రత తెలుసుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌ను 38 దేశాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాలు ఏమీ లేకున్నా.. ఆ వైరస్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో ఉన్న 30 మ్యుటేషన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకపై మాత్రం ఇంకా అస్పష్టత ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల టీకాలు తీసుకున్నవాళ్లు అవసరమైతే బూస్టర్ తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

